Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి, విజరు మెరుపులు
- తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 183/5, ఆసీస్ 335/10
- సెంచూరియన్ టెస్టు రెండో రోజు
నవతెలంగాణ-సెంచూరియన్
రెండో రోజు సెంచూరియన్ టెస్టుపై భారత్ పట్టు బిగించింది. భారత సారథి విరాట్ కోహ్లి (85 బ్యాటింగ్, 130 బంతుల్లో 8 ఫోర్లు), ఓపెనర్ మురళీ విజయ (46 బ్యాటింగ్, 126 బంతుల్లో 6 ఫోర్లు) రాణించటంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అంతకుముందు ఇషాంత్ శర్మ మెరుపులతో కీలక డుప్లెసిస్ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 335 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ముగించింది. హార్దిక్ పాండ్య (11 బ్యాటింగ్) నైట్ వాచ్‌మన్‌గా ఉన్నాడు. 152 పరుగుల వెనుకంజలో ఉన్నది భారత్. నేడు కోహ్లి జోరు ఇలాగే కొనసాగితే భారత్ తొలికు తొలి ఇన్నింగ్స్‌లోనే ఆధిక్యం లభించటం ఖాయం.
కోహ్లి దూకుడు : భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ. ఓపెనర్ కేఎల్ రాహుల్ (10) పదో ఓవర్ మూడో బంతికే కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్లో వచ్చిన చటేశ్వర్ పుజారా తదుపరి బంతికే సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను విరాట్ కోహ్లి (85), మరో ఓపెనర్ మురళీ విజరు (46) ఆదుకున్నారు. మురళీ అండగా కోహ్లి రెచ్చిపోయాడు. మురళీ అనంతరం రోహిత్ (10), పార్థివ్ (19) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఆట ముగిసే సమయానికి కోహ్లికి తోడుగా పాండ్య (11 నాటౌట్) అజేయంగా నిలిచాడు. అంతకుముందు 269/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా డుప్లెసిస్ (63) కు జీవం అంది, అర్థ శతకం చేయటంతో 335 పరుగులు చేసింది. రెండో రోజు ఇషాంత్ రెండు, అశ్విన్, షమి చెరో వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : డీన్ ఎల్గార్ (సి) మురళీ విజరు (బి) రవిచంద్రన్ అశ్విన్ 31, ఏడెన్ మార్క్్రం (సి) పార్థివ్ పటేల్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 94, హషీమ్ ఆమ్లా రనైట్ (హార్దిక్ పాండ్య ) 82, ఏబీ డివిలియర్స్ (బి) ఇషాంత్ శర్మ 20, డుప్లెసిస్ (బి) ఇషాంత్ 63, క్వింటన్ డికాక్ (సి) విరాట్ కోహ్లి (బి) అశ్విన్ 0, వెర్నన్ ఫిలాండర్ రనౌట్ (పార్థివ్ పటేల్/హార్దిక్ పాండ్య) 0, కేశవ్ మహరాజ్ (సి) పార్థివ్ పటేల్ (బి) షమి 18, కగిసో రబాడా (సి) హార్దిక్ పాండ్య (బి) ఇషాంత్ 11, మోర్నీ మోర్కెల్ (సి) విజరు (బి) అశ్విన్ 6, లుంగిసని ఎంగిడి నాటౌట్1, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం : (113.5 ఓవర్లలో 10 వికెట్లకు) 335.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 22-6-60-0, మహమ్మద్ షమి 15-2-58-1, ఇషాంత్ శర్మ 22-4-46-3, హార్దిక్ పాండ్య 16-4-50-0, రవిచంద్రన్ అశ్విన్ 38.5-10-113-4.
భారత్ తొలి ఇన్నింగ్స్ : మురళీ విజరు (సి) డికాక్ (బి) మహారాజ్ 46, లోకేష్ రాహుల్ (సి,బి) మోర్కెల్ 10, చటేశ్వర్ పుజారా రనైట్ (లుంగి) 0, విరాట్ కోహ్లి బ్యాటింగ్ 85, రోహిత్ శర్మ ఎల్బి (బి) రబాడా 10, పార్థివ్ పటేల్ (సి) డికాక్ (బి) లుంగి 19, హర్దిక్ పాండ్య బ్యాటింగ్ 11, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం : (61 ఓవర్లలో 5 వికెట్లకు) 183.
బౌలింగ్ : కేశవ్ మహరాజ్ 16-1-53-1, మోర్నీ మోర్కెల్ 15-3-47-1, వెర్నన్ ఫిలాండర్ 9-3-23-0, కగిసో రబాడా 12-0-33-1, లుంగిసని ఎంగిడి 9-2-26-1.