Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : సోషల్ మీడియాలో క్రికెటర్లు పోస్ట్‌లు పెట్టడం, దానికి వ్యంగ్య కౌంటర్లు సహచరుల నుంచి రావటం అభిమానులకు కొత్త కాదు. భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ ట్వీట్టర్లో పంచ్‌లు పేల్చటంలోనూ సిద్ధహస్తుడయ్యాడు. అయితే, తాజాగా జరిగిన ఓ సంభాషణ కాస్త ఆశ్చర్యానికి, కొంత వివాదానికి దారితీసింది. నైక్ సంస్థ రూపొందించిన నూతన రన్నింగ్ షూలతో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ట్వీట్టర్లో పోస్ట్ పెట్టాడు. అద్భుతంగా ఉన్నాయని, వీటితో సాధన చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని అశ్విన్ అందులో తెలిపాడు. ఇందుకు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షలె గిబ్స్ నుంచి వేగంగా బదులు వచ్చింది. ' ఈ షూలతో నీ వేగంలోనూ పురోగతి వస్తోందని ఆశిస్తున్నాను' అని జోక్ పేల్చాడు. దీన్ని అశ్విన్ కాస్త సీరియస్‌గా తీసుకునట్టున్నాడు. నిజమే, నీ అంత వేగంతో నేను పరుగెత్తలేను. కానీ అన్నం పెట్టే ఆటను ఫిక్స్ంగ్కు పాల్పడకుండా విలువలతో ఆడే స్వభావం నాకున్నది' అని సమాధానం ఇచ్చాడు. అశ్విన్ ట్వీట్‌తో గిబ్స్‌తో పాటు అభిమానులు కాస్త అవాక్కయ్యారు. అశ్విన్ జోక్‌ను క్రీడాస్ఫూర్తితో తీసుకోలేదని గిబ్స్ అనగా, ఇదీ కూడా జోకే సోదరా అంటూ అశ్విన్ అనేశాడు. గిబ్స్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే, అశ్విన్ నుంచి ఇటువంటి రిప్లే రాకపోయి ఉంటేనే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. Q