Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూర్ : సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆఖరి అంకానికి చేరుకున్నది. రెండు అంచెల సెమీఫైనల్స్ సమరంలో గెలుపొందిన బెంగళూర్ ఎఫ్సీ, చెన్నయిన్ ఎఫ్సీలు నేడు ఐఎస్ఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అరంగ్రేట బెంగళూర్ సొంతగడ్డపై అంతిమ పోరు జరుగుతున్నా.. ఆతిథ్య జట్టుకు ఫైనల్ అచ్చిరాని రికార్డు ఐఎస్ఎల్ సొంతం. ఈసారి లీగ్ దశలో బెంగళూర్పై చెన్నయిన్ 2-1తో గెలుపొందింది. కానీ బెంగళర్ తరఫున స్టార్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. దీంతో టైటిల్ పోరు హోరాహోరీగా ఉండటం ఖాయమే. తుది పోరు నేడు సాయంత్రం 8 గంటలకు ఆరంభం కానున్నది.