Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌తో కివీస్ తొలి టెస్టు
ఆక్లాండ్ : వరుణుడు తీవ్ర అంతరాయం కల్గించిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (102, 220 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) ఆ జట్టు తరఫున రికార్డు శతకం సాధించాడు. 18వ టెస్టు సెంచరీ బాదిన విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వర్షం అంతరాయం కారణంగా రెండో రోజు 21 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. 92.1 ఓవర్లలో 229/4తో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. వాట్లింగ్ (17), నికోలస్ (49) అజేయంగా కొనసాగుతున్నారు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి దెబ్బకు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంతో దూసుకెళ్తోంది.
మార్టినే మేటి : జాతీయ జట్టు తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించినా.. దిగ్గజ ఆటగాడు మార్టిన్ క్రో ఇప్పటికీ కివీస్ ఆల్‌టైమ్ గ్రేట్ అని విలియమ్సన్ పేర్కొన్నాడు. విలియమ్సన్ క్లాసికల్ బ్యాటింగ్‌తో ఆధునిక మేటి బ్యాట్స్‌మన్ రేసులో కోహ్లి, స్మిత్, రూట్లతో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. గణాంకాలు ఎప్పుడూ ఆలోచించలేదని, మార్టిన్ క్రోతో నాకు పోలిక సబబు కాదని.. ఎప్పటికీ అతడే కివీస్ ఆల్‌టైమ్ బెస్ట్ అని విలియమ్సన్ చెప్పాడు.