Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాగస్వామి నుంచి కోరుకునేది అదే : విరాట్ కోహ్లి
ముంబయి: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా ఒకర్ని మరొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు. దీనికి వీరు సోషల్మీడియాలో పోస్ట్ చేసే పోస్టులను చూస్తే అర్థమవుతుంది.అనుష్క చేసే సినిమా విశేషాల గురించి విరాట్ స్పంది స్తుంటారు. అనుష్క కూడా ట్వీట్లు చేస్తూ కోహ్లిని ఉత్సాహపరుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కోహ్లీ తన ప్రియమైన సతీమణి గురించి మాట్లాడుతూ ఆమె తన బలమని చెప్పారు. 'అనుష్క నా పూర్తి బలం. ఎప్పుడూ నన్ను పాజిటి వ్గా ఉంచుతుంది. జీవిత భాగస్వామి నుంచి కోరుకునేది అదేగా. అవును.. నేను చాలా అదృష్ట వంతుడ్ని' అని విరాట్ ఆనందంతో తెలిపారు.చాలా ఏండ్లు ప్రేమలో ఉన్న తర్వాత విరాట్, అనుష్క గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన విషయం విదితమే. పెళ్లి తర్వాత వీరు సోషల్మీడియా వేదికగా చేసుకున్నారు. ఒకరికొకరూ తమ ప్రేమను తెలుపుతూ వస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో తీసిన ఫొటోలను షేర్ చేసుకోవటంతో ఇద్దరి అభిమానులు కూడా తెగ ఆనందపడి ట్వీట్ చేయటానికి రెడీఅయిపోతున్నారు..