Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డేల్లో వరల్డ్ రికార్డు స్కోర్ నమోదు
నాటింగ్హోమ్: ఆస్ట్రేలియాతో నాటింగ్హోమ్లో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చితక్కొట్టారు. 481 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించారు. అంతకుముందు తన పేరు మీదే ఉన్న అత్యధిక పరుగుల (444) రికార్డును ఇంగ్లాండ్ చెరిపేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో బేయిర్స్టో (139), అలెక్స్ హేల్స్ (147), జేసన్ రారు (82)లు చెలరేగి ఆడారు. వీరికి తోడుగా చివర్లో వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (67) కూడా రెచ్చిపోయి ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది.