Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో సెరెనాపై గెలుపు
- మహిళల సింగిల్స్ ట్రోఫీ సొంతం
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్ : దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు 24వ గ్రాండ్‌స్లామ్ వేటలో చుక్కెదురు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న సెరెనా.. మళ్లీ రాకెట్ పట్టి కోర్టులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్ఫూర్తిదాయక విజయాలతో ఫైనల్లోకి చేరిన సెరెనా విలియమ్స్‌కు జర్మనీ భామ ఎంజెలికా కెర్బర్ ఝలక్ ఇచ్చింది. 65 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో అమెరికా స్టార్‌పై మెరుపు విజయం సాధించింది. 6-3, 6-3తో గెలుపొందిన కెర్బర్ కెరీర్ తొలి వింబుల్డన్ ట్రోఫీని సొంతం చేసుకున్నది. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెరెనాపై విజయంతోనే కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ సాధించిన కెర్బర్.. తాజాగా ఆమెపై గెలుపుతోనే మూడో గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నది.
నడాల్ నిష్క్రమణ : మరో మారథాన్ ఉత్కంఠ సెమీస్‌లో వరల్డ్ నం.1 రఫెల్ నడాల్ ఓటమిపాలయ్యాడు. రెండు రోజుల్లో ఐదున్నర గంటల పాటు సాగిన రెండో సెమీఫైనల్లో నడాల్ నిష్క్రమించాడు. 6-4, 3-6, 7-6(11-9), 3-6, 10-8తో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రెండో రోజు కొనసాగిన ఆటలో తొలి సెట్‌ను 6-3తో నెగ్గి నడాల్ విజయంపై ఆశలు రెకేత్తించినా.. సూపర్ టైబ్రేకర్‌లో జకోవిచ్ 10-8తో నడాల్ పోరుకు తెరదించాడు. నేడు జరిగే మెన్స్ సింగిల్స్ ఫైనల్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో జకో తలపడనున్నాడు.