Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్ యువ సంచలనం ఎంబపె
పారిస్: రష్యా వేదికగా ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో గోల్ కొట్టిన అతిపిన్న వయస్కుడిగా ఫ్రాన్స్ ఆటగాడు ఎంబపె రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ 19 ఏళ్ల యువ సంచలనం టోర్నీ ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని ఛారిటీకి ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆడినందుకు ఒక్కో మ్యాచ్కు 22,500 డాలర్ల(ఈ టోర్నీలో అతడు ఎనిమిది మ్యాచ్లు ఆడాడు)తో పాటు ఫైనల్లో విజేతగా నిలిచినందుకు సుమారు 3.5లక్షల డాలర్లను అదనంగా అందుకుంటాడు. ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ద్వారా ఎంబపె సుమారు 5లక్షల డాలర్లను అందుకున్నాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.4కోట్లకు పైమాటే. ఈ మొత్తాన్ని అతడు ఛారిటీకి ఇవ్వనున్నట్లు తెలిపి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. క్రీడాభివద్ధికి, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఈ మొత్తాన్ని ఉపయోగించాలని ఆ స్వచ్ఛందసంస్థను ఎంబపె కోరాడు.