Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వర్థమాన షట్లర్, హైదరాబాదీ అమ్మాయి ఎ. అభిలాష ముచ్చటగా మూడు టైటిళ్లు సొంతం చేసుకున్నది. హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో అభిలాష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గర్ల్స్ అండర్-17లో తేజస్వినిపై, గర్ల్స్ అండర్-19లో శ్రావ్యపై గెలుపొందిన అభిలాష.. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రణాళిపై 15-11, 15-12తో వరుస గేముల్లో గెలుపొందింది. మూడు విభాగాల్లో చాంపియన్‌గా నిలిచిన అభిలాషకు హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ప్రశంసా పత్రం, మెడల్స్ అందించారు.