Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచే ప్రొ కబడ్డీ సీజన్ 6
చెన్నై : కబడ్డీ కూత నేటి నుంచి ఆరంభం కానున్నది. ఆదరణ పొందగలదా? అనే అనుమానంతో మొదలైన ప్రొ కబడ్డీ లీగ్ మూడేండ్ల కాలంలోనే పట్టణ, గ్రామీణ ప్రజల విశేష ఆదరణ సంపాదించింది. ఐదు సీజన్లను అత్యంత విజయవంతంగా ముగించుకున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో నేటి నుంచి ఆరో సీజన్ ఆరంభం కానున్నది. చెన్నైలో జరుగనున్న సీజన్ ఆరంభ మ్యాచ్‌లో లోకల్ టీమ్ తమిళ తలైవాస్‌తో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ తలపడనున్నది. అక్టోబర్ 7 నుంచి ఆరంభం కానున్న ఆరో సీజన్లో 12 జట్లు పోటీపడనున్నాయి. బెంగాల్ వారియర్స్, బెంగళూర్ బుల్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ ఫార్చున్ జియంట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ తలైవాస్, తెలుగు టైటాన్స్, యు ముంబా, యూపీ యోధాలు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఐదు సీజన్లుగా టైటిల్ వేటలో నిరాశకు గురైతున్న తెలుగు టైటాన్స్ ఈసారైనా కప్పు కొట్టాలనే తపనతో కనిపిస్తోంది. గత మూడు సీజన్లుగా టైటిల్ నిలుపుకున్న పట్నా పైరేట్స్ తాజా సీజన్లోనూ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ప్రొ కబడ్డీ కూత హైదరాబాద్‌లో డిసెంబర్ వినపడనున్నది. డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ మ్యాచులు జరగనున్నాయి.