Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా, జపాన్ టెన్నిస్ ఓపెన్లు
బీజింగ్/టోక్యో : డబ్ల్యూటీఏ, ఏటీపీ టెన్నిస్ టూర్ టోర్నీల్లో కరొలినా వొజ్నియాకి, డానిల్ మెద్వదెవ్ మెరిశారు. వరల్డ్ నం.2, డెన్మార్క్ భామ వొజ్నియాకి కెరీర్ 30వ టైటిల్ సాధించగా, క్వాలిఫయర్‌తో వరుసగా రెండో ట్రోఫీ అందుకున్నాడు మెద్వదెవ్. ఆదివారం జరిగిన చైనా ఓపెన్ ఫైనల్లో కరొలినా వొజ్నియాకి (డెన్మార్క్) 6-3, 6-3తో వరుస సెట్లలో అనస్థాసియా సెత్వలోవా (లాతివా)పై అలవోక విజయం సాధించింది. ' నా చిన్నప్పటి కలలు నిజమవుతున్నాయి. ఆనందంగా ఉంది. ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారి, వరల్డ్ నం.1 ర్యాంక్ సాధించి గ్రాండ్‌స్లామ్‌లు ముద్దాడాలని కలలు కన్నాను. అవి ఇప్పుడు నిజమవుతున్నాయి. కెరీర్ 30వ టైటిల్ ఎంతో సంతోషానిచ్చింది' అని విజయానంతరం వొజ్నియాకి సంబురపడింది.
లోకల్ హీరో కిరు నిషికోరిని చిత్తు చేసిన రష్యన్ కుర్రాడు మెద్వదెవ్ 6-2, 6-4తో జపాన్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్స్‌కు చేరిన నిషికోరిపై మెద్వదెవ్ అద్భుతంగా ఆడాడు. జపాన్ ఓపెన్‌ను నెగ్గిన తొలి రష్యన్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.