Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌తో అమ్మాయిల పోరు నేడు
- గ్రూప్‌లో అగ్రస్థానంపై ఇరు జట్ల గురి
- హర్మన్‌ప్రీత్, మిథాలీరాజ్లపై ఫోకస్
- రాత్రి 8.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
జార్జిటౌన్ (గయాన)
ఓ వైపు మూడు సార్లు ప్రపంచకప్ విజేత. మరోవైపు గత మూడు టోర్నీలుగా నాకౌట్‌కు చేరలేకపోయిన జట్టు. ఇప్పుడీ రెండు జట్లు టీ20 ప్రపంచకప్‌లో ఆధి పత్యం కోసం పోటీపడుతున్నాయి. మూడు సార్లు ట్రోఫీ విజేత ఆస్ట్రేలియా మరో విజయంపై కన్నేయగా, గ్రూప్‌లో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న టీమ్ ఇండియా మరో గెలుపు సాధించాలని భావిస్తోంది. తొలిసారి ప్రపంచకప్ ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోన్న హర్మన్ప్రీత్సేనకు నేడు అసలు సిసలు పరీక్ష ఎదురు కానున్నది. మహిళల క్రికెట్ పవర్ హౌస్ ఆస్ట్రేలియాను 2017 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో చిత్తు చేసిన టీమ్ ఇండియా నేడూ అదే ఫలితం పునరావృతం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. గ్రూప్-బిలో పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్‌లపై విజయాలతో ఆస్ట్రేలియా, భారత్‌లు సెమీఫైనల్లోకి ప్రవే శించాయి. నేటి మ్యాచ్‌లో విజేత గ్రూప్-బి అగ్రస్థానం ఎవరిదో తేల్చనున్నది.
హర్మన్ప్రీత్పైనే ఫోకస్ : పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ మెరుపు శతకంతో భారత్ టైటిల్ వేటను మొదలెట్టింది. నిరుడు వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 175 ఇన్నిం గ్స్‌తో హర్మన్‌ప్రీత్ హవా మొదలైంది. నేడు సైతం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో హర్మన ్ప్రీత్ కౌర్ అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు సిద్ధమవుతోంది. వెటరన్ బ్యాట్స్‌మన్ మిథాలీరాజ్ సైతం వరుస అర్ధ సెంచరీలతో ఫామ్‌లో ఉంది. ఓపెనర్ స్మృతి మంధాన, యువ కెరటం జెమీమా రొడ్రిగస్‌లు సైతం మెరిస్తే భారత్ అలవో కగా భారీ స్కోరు సాధించేందుకు వీలుంది. కరీబియన్ స్లో పిచ్‌లపై భారత స్పిన్ త్రయం కీలకం కానున్నది. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాధ యాదవ్‌లు ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను మాయ చేయటంపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఆసీస్‌ను ఆపతరమా..! : పురుషుల క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి టీమ్ ఇండియా గండి కొట్టినా, మహిళల క్రికెట్లో ఇంకా కంగారూ అమ్మాయిలదే పైచేయి. ఒంటిచేత్తో మ్యాచుల్ని గెలిపించటంలో కంగా రూ అమ్మాయిలు దిట్ట. కెప్టెన్ మెగ్ లానింగ్, వికెట్ కీపర్ అలిసా హీలే, బెత్ మూనీ, ఆల్‌రౌం డర్ ఎలిసీ పెర్రీ సహా మెఘన్ స్కట్, ఎలిసీ విలనీలు భీకర ఫామ్‌లో ఉన్నారు. గ్రూప్ దశలో మూడు మ్యాచుల్లోనూ మెరుపు ప్రదర్శనలు చేసిన ఉత్సాహంలో ఉన్నారు.
గ్రూప్ దశలో హాట్రిక్ విజయా లతో ఆస్ట్రేలియా, భారత్‌లు పట ిష్టంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్ల కీలక బ్యాట్స్‌మన్, ప్రధాన బౌలర్లు అంచనాలను అందుకుంటున్నారు. దీంతో నేటి భారత్, ఆసీస్ మ్యాచ్ మినీ ఫైనల్‌ను తలపించనున్నది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్, మంధాన, రొడ్రిగస్‌లు కీలకం కాను న్నారు. మెగ్ లానింగ్, విలనీ, స్కట్, హీలే ప్రదర్శన ఆస్ట్రేలియా విజ యాన్ని నిర్ణయించనున్నది!.