Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్ల పాటు ర్యాంకింగ్‌లో నో ఛేంజ్
- డబ్ల్యూటీఏ నిర్ణయం
సెయింట్‌పీటర్స్‌బర్గ్: మహిళ టెన్నిస్ ప్లేయర్స్ మాతృత్వసమయంలో.. ర్యాంకింగ్‌లో మార్పులు చేయరాదని అంతర్జాతీయ మహిళ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) నిర్ణయించింది. ఏ క్రీడాకారిణి అయితే ర్యాంకింగ్‌లో బ్రేక్ తీసుకుంటుందో..మూడేండ్లపాటు ఆ ర్యాంకింగ్ సురక్షితంగా ఉంటుంది. ఈ విధానం కేవలం మాతృత్వం అయిన క్రీడాకారిణియే కాకుండా గాయాలపాలైన ఆటగాళ్లకూ వర్తిస్తుంది. అయితే అలాంటి ఆటగాళ్లకు టోర్నమెంటు సీడింగ్ ఇచ్చే విషయంలో గ్యారంటీనా..అంటే డబ్ల్యూటీఏ సమాధానమిచ్చేందుకు నిరాకరించింది.
డబ్ల్యూటీఏ ఏమంటున్నదంటే..
సీడింగ్ ఇచ్చే అధికారం టోర్నమెంట్లు నిర్వహించే వారి వద్దర ఉంటుంది. మొదటి రౌండ్లో సీడెడ్ ఆటగాడితో ఇలాంటి క్రీడాకారులు పోటీ చేయకూడదు.
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ 2017 తల్లి అయ్యాక...ఈ ఏడాది ఫిబ్రవరిలో రీఎంట్రీ నిచ్చింది. కానీ ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎలాంటి సీడింగ్ ఇవ్వలేదు. వింబుల్డన్‌లో ఆమెకు 25 వ ర్యాంకు ఇచ్చారు.వాస్తవానికి ర్యాంకింగ్ విషయానికొస్తే టాప్ 32 నుంచి బయటే ఉన్నది. డ్రెస్‌కోడ్ నుంచి మినహాయింపు నిచ్చింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ ఇష్టపడే బ్లాక్ క్యాడ్ డ్రస్ ధరించవచ్చు. లెగింగ్,మిడ్ థర్డ్ కంప్రెషన్ షర్ట్స్ లేకుండా స్కర్ట్లు ధరించవచ్చు.