Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్త్ టెస్ట్‌లో రాణించిన బౌలర్లు
- ఆస్ట్రేలియా 277/6
పెర్త్ : పెర్త్ టెస్ట్‌లో భారత్ ఆతిథ్య ఆస్ట్రేలియాకు తొలిరోజే పగ్గాలు వేసింది. బ్యాటింగ్‌కు అనువుగా ఉన్న పెర్త్ ఓపస్ స్టేడియం వేదికగా ప్రారంభమైన టెస్ట్‌లో టాస్ గెల్చి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కంగారూజట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు హారిస్ (70), ఆరోన్ ఫించ్ (50) తొలి వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించింది. షాన్ మార్ష్, 45, హెడ్ 58 పరుగులు చేయడం ద్వారా తమ జట్టును ఆదుకున్నారు. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, హనుమ విహారి రెండేసి వికెట్లు, యాదవ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.
విహారికి చోటు
అంతకుముందు టీమిండియా రెండు మార్పులతో తుదిజట్టును ప్రకటించింది. గాయాలపాలైన రోహిత్, అశ్విన్‌ల స్థానంలో విహారి, ఉమేష్ యాదవ్‌లకు చోటు కల్పించారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలిటెస్ట్ నెగ్గడం ద్వారా టీమిండియా ఇప్పటికే 1-0 ఆధిక్యం సంపాదించింది.
ఆసీస్‌కు 10వ టెస్ట్ వేదిక...
ఆధునిక క్రికెట్‌కు చిరునామా ఆస్ట్రేలియా టెస్ట్ వేదికల సంఖ్య పదికి చేరింది. టీమిండియాతో ప్రస్తుత సిరీస్ రెండోటెస్ట్‌కు ఆతిథ్యమిస్తున్న పెర్త్‌లోని నయా వేదిక ఆఫ్టస్ స్టేడియం ఆస్ట్రేలియా సరికొత్త టెస్ట్ వేదికగా రికార్డుల్లో చేరింది. మొత్తం 50 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఈ బహుళ క్రీడావేదికలో క్రికెట్‌తోపాటు రగ్బీ, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించేకొనే వీలుంది. అంతేకాదు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక స్టేడియం రెండోటెస్ట్‌కు వేదిక కావడంతో ఇంతకుముందు వరకూ ఉన్న వాకా స్టేడియం ఇక అందమైన గతంగా మిగిలిపోనుంది.
స్కోర్ బోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : హర్రీస్ (సి) రహానే (బి) విహారి 70, ఫించ్ (ఎల్బి) బుమ్రా 50, ఖ్వాజా (సి) పంత్ (బి) ఉమేష్ 5, షాన్ మార్ష్ (సి) రహానే (బి) విహారి 45, హ్యాండ్‌కోంబ్ (సి) కోహ్లీ (బి) ఇషాంత్ 7, హెడ్ (సి) షమి (బి) ఇషాంత్ 58, పైన్ (బ్యాటింగ్) 16, కమ్మిన్స్ (బ్యాటింగ్) 11, అదనం 15. (మొత్తం 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు.
బౌలింగ్ : ఇషాంత్ 16-7-35-2, బుమ్రా 22-8-41-1, యాదవ్ 18-2-68-1, షమి 19-3-63-0, విహారి 14-1-53-2, విజరు 1-0-10-0