Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారి టైగా ముగిసిన ఫైనల్స్
-షూటౌట్లో ఓడిన నెదర్లాండ్స్
భువనేశ్వర్ : హాకీ ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరిన బెల్జియం తుదిపోరులో అదృష్టం తోడుకావడంతో ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలిసారి హాకీ విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం బెల్జియం-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి వరకూ సమ ఉజ్జీలు నిలవడంతో ఆట పూర్తి సమయం గడిచినా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 0-0తో ఉన్నాయి. హాకీ ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగియడం చరిత్రలో ఇదే మొదటిసారి. మ్యాచ్ డ్రాగా ముగియడంతో విజేతను నిర్ణయించడం కోసం పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్ కూడా చాలా ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల తమ తమ ఐదు అవకాశాలు ముగిసే సరికి 2-2తో సమంగా నిలిచాయి. ఇక చివరి చాన్స్‌లో నెదర్లాండ్స్ క్రీడాకారుడు హెర్జ్బెర్గర్ విఫలం చెందగా, బెల్జియంకు చెందిన వాన్ అయుబెల్ విజయం సాధించాడు. దీంతో బెల్జియం తొలిసారి టైటిల్ అందుకుంది.కాగా, ఆదివారం మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 8-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నిలో అతిథ్య భారత్ 6వ స్థానంలో నిలిచింది.