Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: యువరాజ్ సింగ్ అభిమానులను మురిపించాడు. తనదైన శైలిలో రివర్స్ స్వీప్ సిక్సర్‌తో అలరించాడు. చాన్నాళ్ల తర్వాత అతడి నుంచి వైవిధ్యమైన షాట్ చూడడం గమనార్హం. ప్రస్తుతం ఆ సిక్సర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాలెలోని ఎకువేణి స్పోర్ట్స్ మైదానంలో ఎయిర్ ఇండియా, మాల్దీవుల జట్టు స్నేహ పూర్వక మ్యాచ్ ఆడాయి. ఎయిర్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యువీ స్పిన్నర్ వేసిన బంతిని అద్భుతమైన రీతిలో సునాయాసంగా రివర్స్ స్వీప్ చేశాడు. బంతి అలవోకగా బౌండరీ సరిహద్దు బయట పడింది. భారత్, మాల్దీవుల సంబంధాలు మరింత పటిష్ఠం చేసేందుకు ఈ పోటీ నిర్వహించారు. మూడేళ్లుగా యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికకావడం లేదు. గత ఐపీఎల్లో విఫలమైన అతడు విదేశాలకు వెళ్లి ఫిట్నెస్ సంతరించుకున్నాడు. నెట్స్‌లో కఠోరంగా సాధన చేస్తున్నాడు. ఈ సీజన్లో అతడు ముంబయి ఇండియన్స్ తరఫున ఆడనున్న సంగతి తెలిసిందే.