Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోహ ప్రపంచకప్‌కు దూరం
బాకు (అజర్బైజాన్) : భారత జిమ్నాస్టిక్స్ మెరుపు, త్రిపుర అమ్మాయి దీప కర్మాకర్ గాయానికి గురైంది. బాకులో జరుగుతున్న ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో పాల్గొంటున్న దీప, శనివారం జరిగిన ఫైనల్లో మోకాలి గాయానికి లోనైంది. అర్హత రౌండ్లలో క్లిష్టమైన హ్యాండ్ఫ్రాంట్ 540 వాల్ట్ విన్యాసం ప్రదర్శించిన దీప 14.466, 14.133తో 14.299 పాయింట్లు సాధించింది. 'ఫైనల్స్‌కు ముందు రోజు దీపకు మోకాలి సమస్య ఉంది. నొప్పిగా ఉండటంతో ఫిజియో సహకారం తీసుకున్నది. మెరుగైన భావన రావటంతో ఫైనల్లో పాల్గొన్నది. తొలి ప్రయత్నంలోనే సరైన ల్యాండింగ్ కొరవడి మోకాలి గాయానికి గురైంది' అని జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ) ఉపాధ్యక్షుడు రియాజ్ భాటియా పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ తర్వాత నుంచి మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న దీప ఏఎల్సీ శస్త్ర చికిత్స తర్వాతే పునరాగమనం చేసింది. తాజా గాయంతో దోహ ప్రపంచకప్‌కు దూరమైంది. జూన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్స్ సమయానికి దీప ఫిట్నెస్ సాధించే అవకాశం కనిపిస్తోంది.