Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ
నవతెలంగాణ-హైదరాబాద్ : గత మూడు సీజన్లలో రెండు సార్లు ఫైనల్స్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఏ ఒక్క ఆటగాడిపైనా ఆధార పడి లేదని కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. ' జట్టులో గొప్ప వాతావరణం కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లు ఎటువంటి అహం లేకుండా జట్టుతో కలిసిపోయారు. సన్‌రైజర్స్ పని విలువల్లో ఇదే కీలకం. జానీ బెయిర్‌స్టో వంటి ఆటగాళ్లతో జట్టుకు సమతుల్యత వచ్చింది. జట్టుగా సన్‌రైజర్స్ గొప్ప ఆత్మ విశ్వాసంతో ఉంది, ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడలేదు' అని మూడీ అన్నాడు. గత సీజన్లతో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్‌కు బలమైన స్పిన్ విభాగం ఉందని బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. ' సన్‌రైజర్స్‌కు ముందుగా రషీద్ ఖాన్ ఉన్నాడు. గత సీజన్లో స్పిన్నర్లు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ ఈ సీజన్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల స్పిన్ బృందం ఉంది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు తోడు లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్, అభిషేక్ శర్మలు జట్టులో ఉన్నారు' అని మురళీ తెలిపాడు. గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ ఈ ఏడాది టైటిల్ వేటను మార్చి 24న కోల్కతతో పోరుతో ఈడెన్‌గార్డెన్స్‌లో మొదలెట్టనున్నది. ఐపీఎల్ సీజన్ 12కు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు జెర్సీ ప్రధాన స్పాన్సర్‌గా కూల్‌వింక్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కొత్త భాగస్వాములను ప్రకటించారు.