Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కత, హైదరాబాద్ మ్యాచ్ నేడు
కోల్‌కత : నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ ఢ. ఐపీఎల్లో అదిరే సమవుజ్జీల సమరం. కలర్‌ఫుల్ క్రికెట్ లీగ్‌లో బలమైన బౌలింగ్ విభాగాలున్న జట్లు తలపడటం మరింత ఆసక్తి రేపుతోంది. కోల్‌కతలో భీకర ఆల్‌రౌండర్లు ఉండగా, హైదరాబాద్ సైతం స్టార్ ఆల్రౌండర్లకు నెలవు. ఐపీఎల్ 12 సీజన్ రెండో మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ముఖాముఖి తేల్చుకోనున్నాయి. గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది టైటిల్ వేటను విజయంతో మొదలెట్టాలని భావిస్తోంది. సొంత గడ్డ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత ఎప్పుడూ బలమైన జట్టే. అశేష అభిమానుల నడుమ కోల్‌కతను కొట్టడం ఏమంత సులువు కాదు. ఈ సంగతి సన్‌రైజర్స్‌కు తెలుసు!.
వార్నర్‌పైనే చూపులు : కేప్‌టౌన్ బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన డెవిడ్ వార్నర్ ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. నిషేధ కాలంలో ఇతర లీగ్‌ల్లో ఆడినా, వాటిపై ప్రపంచ క్రికెట్ పెద్దగా శ్రద్ధ వహించదు. వరల్డ్‌కప్‌కు ముందు ఐపీఎల్ ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం సంపాదించాలని వార్నర్ ఆశిస్తున్నాడు. సహజసిద్ధంగా విధ్వంసక ఓపెనర్, కానీ నిషేధం తర్వాత వార్నర్ ఆట శైలిలో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? అనేది అందరి మదినీ తొలుస్తోంది. గాయంతో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ కానె విలియమ్సన్ తొలి మ్యాచ్‌లో ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువ. వార్నర్‌కు తోడుగా ఇంగ్లీష్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మనీశ్ పాండే మూడో స్థానంలో రానుండగా, విజరు శంకర్ నం.4గా బరిలోకి దిగనున్నాడు. అఫ్ఘాన్ గన్స్ రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు హైదరాబాద్‌కు కీలకం కానున్నారు. రషీద్, నబీలు స్పిన్‌తోనే కాదు బ్యాట్‌తోనూ ప్రత్యర్థిని వణికించగలరు. గత సీజన్లలో నబీని సన్‌రైజర్స్ సరిగా వినియోగించుకోలేదు. కానీ, ఈ సీజన్లో నబీ ప్రతిభను పూర్తిగా వాడుకునేందుకు సన్ సిద్ధమైంది. భువీకి తోడు సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. యూసుఫ్ పఠాన్ అనుభవం హైదరాబాద్‌కు అదనపు బలం!.
శుభారంభంపైనే ధ్యాస : సొంతగడ్డపై విజయంతో సీజన్లో శుభారంభం చేయాలని కోల్‌కత భావిస్తోంది. స్లాగ్ ఓవర్లలో పరుగులు పిండుకున్న కెప్టెన్ దినేశ్ కార్తీక్ కోల్‌కతను ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. క్రిస్ లిన్, సునీల్ నరైన్‌లు మరోసారి పించ్ హిట్టింగ్తో ప్రత్యర్థులకు పిచ్చెక్కేందుకు రెడీ అయిపోయారు. రాబిన్ ఉతప్ప, శుభ్‌మన్ గిల్, నితీశ్ రానాలు కీలకం కానున్నారు. విధ్వంసక ఆల్‌రౌండర్ అండ్రూ రస్సెల్‌కు హైదరాబాద్‌కు మెరుగైన రికార్డు లేదు. సన్ సీమర్లు రస్సెల్‌ను ఎప్పటికప్పుడు కట్టడి చేశారు. ఈ చెత్త రికార్డును రస్సెల్ ఎంతోకాలం కొనసాగించేం దుకు ఇష్టపడడు. పియూశ్ చావ్లా, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, ఫెర్గుసన్లతో కూడిన సన్‌రైజర్స్‌కు సవాల్ విసరగలదు.