Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక కెప్టెన్ కరుణరత్నె అరెస్టు
కొలంబో : దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయం సాధించిన ఏకైక ఆసియా కెప్టెన్గా రికార్డు నెలకొల్పిన శ్రీలంక సారథి దిముత్ కరుణరత్నె తప్పతాగి వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం సేవించి కారు నడిపిన కరుణరత్నెనున కొలంబో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కరుణరత్నె మద్యం సేవించి కారు నడపగా అదుపు తప్పి ఓ త్రీ వీలర్ ట్యాక్యీని ఢీ కొట్టాడు. ట్యాక్సీ డ్రైవర్ గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ' వ్యక్తిగత బెయిల్పై కరుణరత్నెను విడుదల చేశాం. సోమవారం కోర్టులో హాజరు అయ్యేందుకు రావాలని చెప్పాం' అని పోలీసు అధికారి తెలిపారు. సఫారీ గడ్డపై సాధించిన చారిత్రక విజయంతో 2019 వరల్డ్కప్ జట్టుకు కరుణరత్నెను కెప్టెన్గా నియమించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తున్న తరుణంలో, అతడి ప్రవర్తన చేటు తెచ్చినట్టే!. కరుణరత్నె డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొన్నది.