Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం అట్లెటికో మాడ్రిడ్‌తో బార్సిలోనా లాలిగా మ్యాచ్‌కు హాజరైన ద్రవిడ్.. సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ గోల్ విన్యాసం ప్రత్యక్షంగా వీక్షించటం మరుపురాని అనుభూతిగా అభివర్ణించాడు. ఈ మ్యాచ్‌లో బార్సిలోనా 2-0తో గెలుపొందగా.. మెస్సీ, స్వారెజ్ చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ పేరుతో బార్సిలోనా జెర్సీని ఆ క్లబ్ అధ్యక్షుడు జొసెప్ మరియా అందించాడు.