Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్‌పై చెలరేగిన గేల్
- పంజాబ్ 173/4
మొహాలి : యూనివర్శల్ బాస్ ఆఖరు వరకూ నిలిచినా తన స్థాయి విధ్వంసం సృష్టించలేదు!. స్పిన్నర్లు సహనాన్ని పరీక్షించినా, తిరిగి బంతిపై విరుచుకుపడలేదు. ఐదు సిక్సర్లు, పది ఫోర్లతో మెరిసిన విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ (99 నాటౌట్, 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) బెంగళూర్‌పై కొత్త తరహా ఇన్నింగ్స్ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ నాల్గో బంతికే ఎల్బీగా వెనుదిరిగాల్సిన గేల్, బెంగళూర్ రివ్యూ కోరకపోవటంతో అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సహచర ఆటగాళ్లలో ఎవరూ రాణించకపోయినా గేల్ ఒంటరి పోరాటం చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 173 పరుగుల పోరాడగలిగే స్కోరు అందించాడు. ముంబయిపై సెంచరీతో చెలరేగిన కెఎల్ రాహుల్ (18) బెంగళూర్‌పై విఫలమయ్యాడు.
గేల్ ఒక్కడే : కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మంచి ఆరంభం లభించినా, ఆశించిన స్కోరు సాధించలేదు. భారీ స్కోర్ల మొహాలీలో క్రిస్ గేల్ (99) అజేయ ఇన్నింగ్స్‌తో నిలిచినా 173 పరుగులకే పరిమితమైంది. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో గేల్ ఎల్బీగా నిష్క్రమించాల్సింది. కానీ బెంగళూర్ కెప్టెన్ కోహ్లి రివ్యూ కోరలేదు. దీంతో అతడే ఆర్సీబీని వేటాడాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో కెఎల్ రాహుల్ (18) రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసినా త్వరగా వికెట్ కోల్పోయాడు. స్పిన్నర్లు చాహల్ (2/33), అలీ (1/19)లు పంజాబ్‌ను కట్టడి చేశారు. ఓ ఎండ్‌లో గేల్ దూకుడుగా ఆడినా.. మరో వైపు సహకారం కొరవడింది. మయాంక్ అగర్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (15), శామ్ కరన్ (1)లు విఫలమయ్యారు. మన్దీప్ సింగ్ (18 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్) వికెట్ నిలుపుకున్నా, డెత్ ఓవర్లలో అవసరానికి తగినట్టు పరుగులు సాధించలేదు. 19 ఓవర్లకు 90 పరుగులతో నిలిచిన గేల్.. చివరి ఓవర్లో నాలుగు బంతులెదుర్కొన్నా సెంచరీ సాధించలేదు. చివరి బంతికి ఫోర్ కొట్టి 99 పరుగులతో అజేయంగా నిలిచాడు.