Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై రాయల్స్ విజయం
-రాణించిన రహానె, శాంసన్
ముంబయి ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న రోహిత్జట్టుకు రాజస్థాన్ రాయల్స్ పంచ్ విసిరింది. ఛేదనలో జోశ్ బట్లర్ (89, 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. బట్లర్ మెరుపులతో రాయల్స్ ఐపీఎల్12లో రెండో విజయం నమోదు చేసింది.
ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు నిలుపుకున్నది!.
ముంబయి
ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు నిలుపుకోవాలంటే, తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మెరిసింది. ముంబయి ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. 188 పరుగుల భారీ ఛేదనను మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ముగించింది, నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జోశ్ బట్లర్ (89, 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. అజింక్య రహానె (37), సంజు శాంసన్ (31) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ఓపెనర్లు క్వింటన్ డికాక్ (81, 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్ శర్మ (47, 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ రాణించటంతో 187 పరుగులు చేసింది. జోశ్ బట్లర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
బట్లర్ దూకుడు : భారీ ఛేదనలో రాజస్థాన్‌కు మెరుపు ఆరంభం లభించింది. బట్లర్ (89)కు తోడుగా అజింక్య రహానె (37, 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓపెనర్ల మెరుపులతో తొలి వికెట్‌కు రాయల్స్ 60 పరుగులు జోడించింది. రహానె నిష్క్రమణ తర్వాత బట్లర్ విధ్వంసం శిఖర స్థాయికి చేరుకున్నది. సంజు శాంసన్ (31, 26 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్) బట్లర్ రెచ్చిపోయాడు. అరంగేట్ర మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఆరు వికెట్లు కూల్చిన అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. 6, 4, 4, 4, 4, 6తో బట్లర్ ఉగ్రరూపం దాల్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బట్లర్ నిష్క్రమించినా, అప్పటికే రాయల్స్ గెలుపు ఖాయమైంది. బట్లర్ వికెట్ తర్వాత ముంబయి అనూహ్యంగా రేసులోకి వచ్చింది. 147/1 నుంచి 174/6తో రాజస్థాన్ కోరుకోని కష్టాల్లో కూరుకుంది. 9 బంతుల వ్యవధిలోనే సంజు, స్మిత్ (12), త్రిపాఠి (1), లివింగ్ స్టోన్ (1) వికెట్లను కోల్పోయింది. శ్రేయాష్ గోపాల్ (13 నాటౌట్) ఉత్కంఠకు తెరదించుతూ రాయల్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. బుమ్రా, పాండ్య వరుస ఓవర్లలో ఫోర్లు కొట్టి రాజస్థాన్‌కు హ్యాట్రిక్ ఓటమిని తప్పించాడు. ముంబయి బౌలర్లలో కృనాల్ పాండ్య మూడు వికెట్లు కూల్చగా, బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
రాణించిన డికాక్ : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబయి ఇండియన్స్‌కు ఓపెనర్లు తిరుగులేని ఆరంభం అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (47) తోడుగా డికాక్ (81) సీజన్లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో రోహిత్ ధనాధన్ మోగించగా.. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో డికాక్ విరుచుకుపడ్డాడు. వీరిద్దరి మెరుపులతో తొలి వికెట్‌కు ముంబయి 96 పరుగులు సాధించింది. లోతైన బ్యాటింగ్ లైనప్ కల్గిన ముంబయికి 10.5 ఓవర్లలో 96/1 ఆరంభం లభించింది. ఈ దశలో ముంబయి సులువుగానే 200 మార్క్ దాటుతుందని అనిపించింది. కానీ చివరి పది ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు మెరుగ్గా బంతులేశారు. సూర్యకుమార్ యాదవ్ (16), కీరన్ పొలార్డ్ (6)లను స్వేఛ్చగా ఆడనీయలేదు. హార్దిక్ పాండ్య (28, 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మూడు సిక్సర్లతో ముంబయికి మెరుపు ముగింపునిచ్చాడు. కృనాల్ పాండ్య (0 నాటౌట్) కంటే ముందొచ్చిన ఇషాన్ కిషన్ ( 3 బంతుల్లో 5) మెప్పించలేదు. రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో రాణించాడు.
స్కోరు వివరాలు
ముంబయి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 47, డికాక్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 81, సూర్యకుమార్ (బి) కులకర్ణి 16, పొలార్డ్ (సి) గోపాల్ (బి) ఆర్చర్ 6, హార్దిక్ పాండ్య నాటౌట్ 28, ఇషాన్ కిషన్ (సి) బట్లర్ (బి) ఉనద్కత్ 5, కృనాల్ పాండ్య నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం :(20 ఓవర్లలో 5 వికెట్లకు) 187.
వికెట్ల పతనం : 1-96, 2-117, 3-136, 4-163, 5-175.
బౌలింగ్ : కృష్ణప్ప గౌతమ్ 3-0-39-0, కులకర్ణి 4-0-38-1, జోఫ్రా ఆర్చర్ 4-0-39-3, జైదేవ్ ఉనద్కత్ 4-0-36-1, శ్రేయాష్ గోపాల్ 4-0-21-0, లివింగ్‌స్టోన్ 1-0-13-0.
రాజస్థాన్ ఇన్నింగ్స్ : రహానె (సి) సూర్యకుమార్ (బి) కృనాల్ 37, బట్లర్ (సి) సూర్యకుమార్ (బి) చాహర్ 89, శాంసన్ (ఎల్బీ) బుమ్రా 31, స్మిత్ (సి) కిషన్ (బి) బుమ్రా 12, త్రిపాఠి (సి) హార్దిక్ (బి) కృనాల్ 1, లివింగ్‌స్టోన్ (బి) కృనాల్ 1, శ్రేయాష్ గోపాల్ నాటౌట్ 13, కృష్ణప్ప గౌతమ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం :(19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 188.
వికెట్ల పతనం : 1-60, 2-147, 3-170, 4-171, 5-174, 6-174.
బౌలింగ్ : జేసన్ 3-0-31-0, అల్జారీ జోసెఫ్ 3-0-53-0, రాహుల్ చాహర్ 4-0-34-1, బుమ్రా 4-0-23-2, కృనాల్ పాండ్య 4-0-34-3, హార్దిక్ పాండ్య 1.3-0-11-0.