Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రషీద్ ఖాన్ మాయజాలం
- చెన్నై సూపర్ కింగ్స్ 132/5
చెన్నై సూపర్ కింగ్స్ 9.4 ఓవర్లలో 79/0. ఓపెనర్లు డెప్లెసిస్ (45), షేన్ వాట్సన్ (31) మరింత దూకుడుగా ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి రావటం ఖాయమే అనిపించింది. కానీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (2/17) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కూల్చి సూపర్ కింగ్స్ జోరుకు ముకుతాడు వేశాడు. డెత్ ఓవర్లలో పరుగుల పొదుపు పాయించిన బౌలర్లు.. చెన్నైని 132 పరుగులకే పరిమితం చేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్
సొంతగడ్డపై సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగారు. సూపర్ ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (2/17) మాయజాలానికి తోడు స్టార్ సీమర్ భువనేశ్వర్ కుమార్ (0/22) బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచాడు. ఓపెనర్లు డుప్లెసిస్ (45), షేన్ వాట్సన్ (31)లు తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. మిడిల్ ఆర్డర్ మెడలు వచ్చిన హైదరాబాద్ చివరి ఓవర్లలో పరుగులే ఇవ్వలేదు. తాత్కాలిక కెప్టెన్ సురేశ్ రైనా (13), కేదార్ జాదవ్ (1) విఫలమయ్యారు. అంబటి రాయుడు (25 నాటౌట్, 21 బంతుల్లో 2 ఫోర్లు), రవీంద్ర జడేజా (20 బంతుల్లో 10 పరుగులు) వేగంగా పరుగులు చేయలేకపోయారు.
నెమ్మదిగా మొదలై, చప్పగా ముగిసే : టాస్ నెగ్గిన సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. హైదరాబాద్ సీమర్లు భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్‌లు నిప్పులు చెరగటంతో తొలి నాలుగు ఓవర్లలో చెన్నై 15 పరుగులే చేసింది. తొలి రెండు ఓవర్లలో భువి, ఖలీల్ చెరో ఏడు పరుగులే ఇచ్చారు. కానీ సందీప్ శర్మ వేసిన తర్వాతి ఓవర్లో 14 పరుగులు, ఖలీల్ ఓవర్లో 12 పరుగులు పిండుకున్న డుప్లెసిస్, వాట్సన్ జోరు పెంచారు. డుప్లెసిస్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ప్రమాదకరంగా కనిపించాడు. నాలుగు ఫోర్లు బాదిన వాట్సన్ అతడికి తోడయ్యాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న షాదాబ్ నదీమ్ ఓపెనింగ్ జోడీని విడదీశాడు. వాట్సన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే డుప్లెసిస్ సైతం వికెట్ వెనకాల క్యాచ్‌తో దొరికిపోయాడు. కెప్టెన్ సురేశ్ రైనా (13), అంబటి రాయుడు (25) జోరు కొనసాగించేలా కనిపించారు. రైనా రెండు ఫోర్లతో దూకుడుగా ఆరంభించాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రైనా, కేదార్ జాదవ్ (1)లను ఎల్బీగా అవుట్ చేశాడు. ఇక్కడితో చెన్నై దూకుడుకు బ్రేక్ పడింది. శామ్ బిల్లింగ్స్ (0) డకౌట్ కాగా.. రవీంద్ర జడేజా (10) 20 బంతులాడి ఒక్క బౌండరీ కొట్టలేదు. రాయుడు రెండు ఫోర్లు కొట్టినా, అంచనాలను అందుకోలేదు. తొలి నాలుగు ఓవర్లలో 15 పరుగులే చేసిన చెన్నై, చివరి ఐదు ఓవర్లలో చెన్నై 30 పరుగులతో సరిపెట్టుకున్నది.
ధోని అవుట్ : 2010 తర్వాత తొలిసారి తాలా ఎం.ఎస్ ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతోంది. వెన్ను నొప్పితో ధోని విశ్రాంతి తీసుకున్నాడు. రైనా చెన్నై సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఓవరాల్‌గా చెన్నై మ్యాచులకు ధోని లేకపోవటం ఇది నాల్గోసారి మాత్రమే.
స్కోరు వివరాలు :
చెన్నై ఇన్నింగ్స్ : షేన్ వాట్సన్ (బి) నదీమ్ 31, డుప్లెసిస్ (సి) బెయిర్‌స్టో (బి) విజరు 45, సురేశ్ రైనా (ఎల్బీ) రషీద్ ఖాన్ 13, అంబటి రాయుడు నాటౌట్ 25, కేదార్ జాదవ్ (ఎల్బీ) రషీద్ ఖాన్ 1, శామ్ బిల్లింగ్స్ (సి) విజరు (బి) ఖలీల్ అహ్మద్ 0, రవీంద్ర జడేజా నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 132.
వికెట్ల పతనం : 1-79, 2-81, 3-97, 4-99, 5-101.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-21-0, ఖలీల్ అహ్మద్ 4-0-22-1, సందీప్ శర్మ 4-0-33-0, షాదాబ్ నదీమ్ 2-0-24-1, రషీద్ ఖాన్ 4-0-17-2, విజరు శంకర్ 2-0-11-1.