Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ 163/7
ఢిల్లీ : విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (69, 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్ ఫామ్ కొనసాగించాడు. 37 బంతుల్లో ఐదు సిక్సర్లు, అర డజను ఫోర్లు కొట్టిన విండీస్ వీరుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు గౌరవ ప్రద స్కోరు అందించాడు. కెఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (2), డెవిడ్ మిల్లర్ (7) విఫలమైన వేళ క్రిస్ గేల్ చెలరేగాడు. గేల్ మెరుపులకు తోడు మన్దీప్ సింగ్ (30), హర్‌ప్రీత్ బ్రార్ (20) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 163 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో సందీప్ మూడు వికెట్లు కూల్చగా.. రబాడ, అక్షర్ పటేల్‌లు తలా రెండో వికెట్లు పడగొట్టారు.
గేల్ అర్ధ సెంచరీ : పంజాబ్ స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ (12) మరో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఓ సిక్సర్, ఫోర్‌తో దూకుడుగా మొదలెట్టి రాహుల్.. క్రీజు వదిలి వికెట్ కోల్పోయాడు. మయాక్ అగర్వాల్ (2), డెవిడ్ మిల్లర్ (7) వికెట్లతో 61/3తో పంజాబ్ ఒత్తిడిలో పడింది. మరో ఎండ్‌లో క్రిస్ గేల్ ధనాధన్ జోరుతో పంజాబ్ స్కోరు బోర్డు వేగంగా సాగినా.. సహకారం కొరవడి భారీ స్కోరు సాధించలేదు. మన్దీప్ సింగ్ (30), హర్‌ప్రీత్ (20 నాటౌట్), సహా అశ్విన్ (16) చివర్లో కాసిన్ని పరుగులు చేశారు. చివరి ఐదు ఓవర్లలో 42 పరుగులు చేసి, పోరాడగలిగే స్థితిలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు బలమైన పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయంలో సక్సెస్ అయ్యారు.