Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచులు నేటికి వాయిదా
పారిస్ (ఫ్రాన్స్) : రొలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్) మరోసారి కుండపోత వర్షానికి గురైంది. 2016 తర్వాత మళ్లీ, ఓ రోజు మ్యాచులన్నీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్‌కు పైకప్పు సౌకర్యం లేదు. బుధవారం ఇక్కడ కుండపోతగా వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి బుధవారం నాటి క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచులు వాయిదా వేయక తప్పలేదు. పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా), మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ సిమోన హెలెప్లు బుధవారమే క్వార్టర్ఫైనల్లో పోటీపడాలి. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచులు నేడు జరుగుతాయి. జకోవిచ్‌తో జర్మనీ యువ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్ పోటీపడుతుండగా.. మరో క్వార్టర్స్‌లో డొమినిక్ థీమ్, కచనోవ్లు తలపడతారు. ఇదే సమయంలో నేడు దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్ సెమీఫైనల్స్ మెగా వార్‌కు సిద్ధమయ్యారు. ఫైనల్లో చోటు కోసం నడాల్‌తో ఫెడరర్ అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంది. 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కు చేరిన నడాల్‌కు ఇక్కడ సెమీస్‌లో ఓడిన చరిత్ర లేదు. 2015 తర్వాత తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న ఫెడరర్, ఇక్కడ ఎన్నోసార్లు నడాల్ చేతిలో భంగపడ్డాడు. మట్టికోర్టులో ఫెడరర్‌పై తిరుగులేని రికార్డున్న నడాల్ నేడు సెమీస్‌లో ఫేవరెట్. నేడు క్వార్టర్స్‌లో జకోవిచ్, హలెప్‌లు విజయం సాధిస్తే.. విరామ రోజు లేకుండా శుక్రవారమే సెమీఫైనల్స్‌లో పోటీపడాల్సి ఉంటుంది.