Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక వినతులు తిరస్కరణ
లండన్ : 2019 ప్రపంచకప్ ఫోకస్ ఉన్నట్టుండి క్రికెటేతర అంశాలపైకి మళ్లుతోంది. వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌పై ఎం.ఎస్ ధోని సైనిక చిహ్నం 'బలిదాన్' వాడటంపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో క్రిస్ గేల్, మోయిన్ అలీల విషయంలోనూ ఐసీసీ స్పందించింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తన బ్యాట్‌పై 'యూనివర్శల్ బాస్' లోగోను వాడేందుకు వీల్లేదని ఐసీసీ స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రచారానికి ఐసీసీ నిబంధనలు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ 'ఫ్రీ పాలస్తీనా' చేతి బ్యాండ్‌ను ధరించడాన్నీ వ్యతిరేకించింది. ఇది నేరుగా రాజకీయ అంశం కావున, అటువంటి చర్యలకు ఐసీసీ మ్యాచుల్లో తావులేదని పేర్కొన్నది.