Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి ఓడిన అఫ్గనిస్థాన్
లీడ్స్ : ప్రపంచకప్ సెమీస్ రేసులో పాకిస్థాన్ బతికిపోయింది. అఫ్గనిస్థాన్ చేతిలో దాదాపు ఓటమి ఖాయం చేసుకున్న పాకిస్థాన్, లోయర్ ఆర్డర్ మెరుపులతో పరాజయం నుంచి తృటిలో బయటపడింది. 228 పరుగుల ఛేదనలో ఇమద్ వసీం (49 నాటౌట్, 54 బంతుల్లో 5 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్ పాకిస్థాన్‌కు 3 వికెట్ల తేడాతో మెరుపు విజయాన్ని అందించింది. ఆఖర్లో వహబ్ రియాజ్ (15 నాటౌట్, 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) అండతో 49.4 ఓవర్లలో ఇమద్ పాకిస్థాన్‌ను గట్టెక్కించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 227/9 పరుగులు చేసింది.
ఇమద్ హీరో! : స్వల్ప ఛేదనలో పాకిస్థాన్ తడబాటుకు గురైంది. ఫకర్ జమాన్ (0) డకౌట్ కాగా.. పాక్ స్కోరు మందగించింది. ఇమామ్ ఉల్ హాక్ (36), బాబర్ ఆజామ్ (45) 72 పరుగుల భాగస్వామ్యంతో పాక్‌ను ఛేదనలో ముందుకు తీసుకెళ్లారు. వరుస వికెట్లు పాక్‌ను ఒత్తిడిలో పడేసింది. హఫీజ్ (19), హరీశ్ సోహైల్ (27), సర్ఫరాజ్ అహ్మద్ (18) నిష్క్రమణతో 156/6తో పాకిస్థాన్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇమద్ వసీం (49) ఒంటరి పోరాటం చేశాడు. షాదాబ్ ఖాన్ (11), వహబ్ రియాజ్ (15) సహకారంతో పాకిస్థాన్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న అఫ్గనిస్థాన్ చివర్లో పట్టు కోల్పోయింది. ముజీబ్ (2/34), నబి (2/23) రాణించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్థాన్ 227 పరుగులు చేసింది. ఓపెనర్ రెహమత్ షా (35, 43 బంతుల్లో 5 ఫోర్లు), నజీబుల్లా జద్రాన్ (42, 54 బంతుల్లో 6 ఫోర్లు), అస్గర్ అఫ్గాన్ (42, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. హస్మతుల్లా (0), మహ్మద్ నబి (16), రషీద్ ఖాన్ (8) విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది (4/47), ఇమద్ (2/48), వహబ్ రియాజ్ (2/29) మెరిశారు. అఫ్గాన్‌కు ఇది వరుసగా ఎనిమిదో ఓటమి కాగా, పాకిస్థాన్‌కు నాల్గో విజయం.
బౌల్ట్ హ్యాట్రిక్ : న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత 243/9 పరుగులు చేసింది. వార్నర్ (16), ఫించ్ (8), స్మిత్ (5), మాక్స్వెల్ (1) విఫలమయ్యారు. ఉస్మాన్ ఖవాజ (88), అలెక్స్ క్యారె (71) అర్ధ సెంచరీలు సాధించారు. కివీస్ స్టీడ్స్టర్ ట్రెంట్ బౌల్ట్ వరుస బంతుల్లో ఖవాజ, స్టార్క్ (0), బెహ్రాన్‌డార్ఫ్ (0) వికెట్లతో ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించాడు.