Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తోలి రౌండ్లో అలవోక విజయం
- జ్వెరెవ్‌కు ఊహించని షాక్
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్ : డిఫెండింగ్ చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ గడ్డి కోర్టులో గర్జన మొదలెట్టాడు. వింబుల్డన్ తొలి రోజే అలవోక విజయంతో టైటిల్ దిశగా ప్రయాణం ప్రారంభిం చాడు. వింబుల్డన్‌లో ఐదో టైటిల్ కోసం వేటాడుతున్న జకోవిచ్, ఈసారి నూతన సహాయక సిబ్బందితో లండన్‌కు వచ్చాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జర్మనీ ఆటగాడు (35 ఏండ్లు) ఫిలిప్పై 6-3, 7-5, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించాడు. గతేడాది రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6-3, 6-4, 6-2తో తొలి రౌండ్ దాటాడు. రెండో రౌండ్లో సెర్బియా ఆటగాడు జంకోతో అండర్సన్ తలపడనున్నాడు. జర్మనీ కొత్త కెరటం, ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు తొలి రౌండ్లో షాక్ ఎదురైంది. చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరి వెసిలే చేతిలో జ్వెరెవ్ నాలుగు సెట్ల పోరులో ఓటమి పాలయ్యాడు. 6-4, 3-6, 2-6, 5-7తో జ్వెరెవ్ మట్టికరిచాడు. తొలి సెట్లో నెగ్గిన జ్వెరెవ్.. తర్వాతి సెట్లలో వరుసగా ఓటమి చెందాడు. జ్వెరెవ్ 24 ఏస్‌లతో మెరిసినా, ఓటమి తప్పలేదు. 106-125తో జ్వెరెవ్ వింబుల్డన్ నుంచి నిష్క్రమించాడు. స్పెయిన్ ఆటగాడు లోపెజ్ 6-4, 6-2, 6-4తో గెలుపొందాడు. స్విస్ స్టార్ వావ్రింకా 6-3, 6-2, 6-2తో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
ఒసాక ఓటమి : మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ నవొమి ఒసాకకు ఓటమి. 6-7(4-7), 2-6తో పుతినొత్సవ (కజకిస్థాన్) చేతిలో ఖంగుతింది. మూడో సీడ్ కరొలినా ఫ్లిస్కోవా 6-2, 7-6(7-4)తో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఏడో సీడ్ సిమోన హలెప్ 6-4, 7-5తో ముందంజ వేసింది.