Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ ఎంజెలికా కెర్బర్ వింబుల్డన్ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించిన కెర్బర్, ఇక్కడ మరియ (జర్మనీ)పై 6-4, 6-3తో వరుస సెట్లలో గెలుపొందింది. ఫ్రెంచ్ ఓపెన్ విజేత, టాప్ సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా) 6-4, 6-2తో చైనా ప్లేయర్‌పై పైచేయి సాధించింది. స్కూల్ గర్ల్, 15 ఏండ్ల కొరి గౌఫ్ సంచలన విజయం సాధించింది. అమెరికా దిగ్గజ ప్లేయర్ వీనస్ విలియమ్స్‌పై 6-4, 6-4తో గెలుపొంది, గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను గ్రాండ్‌ను ఆరంభించింది. మెన్స్ సింగిల్స్‌లో దిగ్గజ ప్లేయర్ రోజర్ ఫెడరర్ 3-6, 6-1, 6-2, 6-2తో హరీశ్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. జపాన్ స్టార్ కిరు నిషికోరి 6-4, 7-6(7-3), 6-4తో రెండో రౌండుకు చేరుకున్నాడు. నిక్ కిర్గియోస్ 7-6(7-4), 3-6, 7-6(12-6)తో ఆసీస్‌కే చెందిన థామ్సన్‌పై విజయం సాధించాడు.