Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ ముంగిట శ్రీకృష్ణప్రియ
హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, వర్థమాన క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియ సీజన్ తొలి టైటిల్ రేసులో నిలిచారు. కామన్వెల్త్ క్రీడల మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ కెనడా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్ షట్లర్ లుకాస్‌పై 12-21, 23-21, 24-22తో ఉత్కంఠ పోరులో కశ్యప్ గెలుపొందాడు. తొలి గేమ్‌లో ఓడిన కశ్యప్.. తర్వాత గేముల్లో టైబ్రేకర్‌లో పైచేయి సాధించాడు. 76 నిమిషాల సెమీస్‌లో విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ షట్లర్ వాంగ్ జు వీతో తలపడనున్నాడు. ఐవరీకోస్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో వర్థమాన షట్లర్, టాప్ సీడ్ శ్రీకృష్ణప్రియ ఫైనల్స్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో వరుస విజయాలు సాధించి టైటిల్ ముంగిట నిలిచింది. 21-16, 21-19తో సెమీస్‌లో నైజీరియా షట్లర్‌పై గెలుపొందింది. నేడు మయన్మార్ అమ్మాయితో అమీతుమీ తేల్చుకోనుంది.