Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019-20 స్వదేశీ, విదేశీ పర్యటనలు ఖరారు
- షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
నవతెలంగాణ - న్యూఢిల్లీ
టీమిండియా క్రికెట్ జట్టు 2019-20లలో బిజీ...బిజీ షెడ్యూల్‌తో సిద్ధమవుతున్నది. ఈమేరకు భారతజట్టు స్వదేశీ, విదేశీ పర్యటనల షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనలో భారతజట్టు బిజీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆగస్టులో వెస్టిండీస్ పర్యటన నుంచి టీమిండియా తిరిగి వచ్చిన అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఆస్ట్రేలియాలతో తలపడనుంది. వచ్చే ఏడాది న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా బయల్దేరి వెళ్లనుంది. న్యూజిలాండ్ పర్యటన ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో మూడు వన్డేలు ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన అనంతరం కోచ్, సహాయ సిబ్బంది గడువు ముగియనుండడంతో బీసీసీఐ ఇప్పటికే ఆ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. స్వదేశంలోని కొన్ని సిరీస్‌లకు జట్టు సభ్యులు, కెప్టెన్లలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది.
విండీస్ పర్యటనకు కోహ్లీ, బుమ్రా
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమౌతున్నారు. తొలుత ప్రపంచకప్ టోర్నీ అనంతరం వీరిద్దరికీ విశ్రాంతి కల్పిస్తున్నట్టు బీసీసీఐ ఇప్పటివరకూ ప్రకటిస్తూ వచ్చింది. కానీ టీమిండియా ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే వెనుదిరగడంతో సారథి విరాట్ కోహ్లీ నిర్ణయం సెలక్టర్లకు ఆశ్చర్యానికి గురిచేసింది. తాను విశ్రాంతిని తీసుకోనని, పూర్తి స్థాయి జట్టుతోనే వెస్టిండీస్ పర్యటనకు వెళతానని సెలక్టర్లకు కోహ్లి తెలిపినట్టు సమాచారం. ప్రపంచకప్ ఓటమి అనంంతరం కెప్టెన్, కోచ్‌ల మార్పుపై తీవ్ర చర్చజరుగుతున్న నేపథ్యంలో రిస్క్ చేయడం ఇష్టం లేకనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారతజట్టు విండీస్ పర్యటనలో భాగంగా ఆగస్టులో మూడు టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 3న టీ20తో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఇక టీమిండియా విండీస్ పర్యటన నేపథ్యంలో క్రిస్ గేల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ప్రపంచకప్ అనంతరం ఆటకు గుడ్‌బై చెబుతానన్న గేల్ భారత్‌తో సిరీస్ ముగిశాక క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.
జింబాబ్వేతో (3 టీ20లు)
జనవరి 5, 2020 : తొలి టీ20 (గువహటి)
జనవరి 7 : రెండో టీ20 (ఇండోర్)
జనవరి 10 : మూడో టీ20 (పూనే)
ఆస్ట్రేలియాతో (3 వన్డేలు)
జనవరి 14 : తొలి వన్డే (ముంబయి)
జనవరి 17 : రెండో వన్డే (రాజ్‌కోట్)
జనవరి 19 : మూడో వన్డే (బెంగళూరు
న్యూజిలాండ్ పర్యటనకు (5 టీ20లు,
3 వన్డేలు, 2 టెస్ట్‌లు)
జనవరి 24 : తొలి టీ20 (అక్లాండ్)
జనవరి 26 : రెండో టీ20 (అక్లాండ్)
జనవరి 29 : మూడో టీ20 (హామిల్టన్)
జనవరి 31 : నాల్గో టీ20 (వెల్లింగ్టన్)
ఫిబ్రవరి 2 : ఐదో టీ20 (మౌంట్ మొఘనరు)
ఫిబ్రవరి 5 : తొలి వన్డే (హామిల్టన్)
ఫిబ్రవరి 8 : రెండో వన్డే (అక్లాండ్)
ఫిబ్రవరి 11 : మూడో వన్డే (మౌంట్ మొఘనరు)
ఫిబ్రవరి 21-25 : తొలి టెస్ట్ (వెల్లింగ్టన్)
ఫిబ్రవరి 29-మార్చి4 : రెండో టెస్ట్ (క్రైస్ట్‌చర్చ్)
ఆస్ట్రేలియాతో (3 వన్డేలు)
మార్చి 12 : తొలి వన్డే (ధర్మశాల)
మార్చి 15 : రెండో వన్డే (లక్నో)
మార్చి 18 : మూడో వన్డే (కోల్‌కతా)
స్వదేశంలో...
దక్షిణాఫ్రికా జట్టుతో (3 టీ20లు, 3 టెస్ట్‌లు)
సెప్టెంబర్ 15 : తొలి టీ20 (ధర్మశాల)
సెప్టెంబర్ 18 : రెండో టీ20 (మొహాలి)
సెప్టెంబర్ 22 : మూడో టీ20 (బెంగళూరు)
అక్టోబర్ 2-6 : తొలిటెస్ట్ (విశాఖ)
అక్టోబర్ 10-14 : రెండోటెస్ట్ (రాంచి)
అక్టోబర్ 19-23 : మూడోటెస్ట్ (పూనే)
బంగ్లాదేశ్ జట్టుతో (3 టీ20లు, 2 టెస్ట్‌లు)
నవంబర్ 3 : తొలి టీ20 (ఢిల్లీ)
నవంబర్ 7 : రెండో టీ20 (రాజ్‌కోట్)
నవంబర్ 10 : మూడో టీ20 (నాగ్‌పూర్)
నవంబర్ 14-18 : తొలిటెస్ట్ (ఇండోర్)
నవంబర్ 22-26 : రెండోటెస్ట్ (కోల్‌కతా)
వెస్టిండీస్‌తో (3 టీ20లు, 3 వన్డేలు)
డిసెంబర్ 6 : తొలి టీ20 (ముంబయి)
డిసెంబర్ 8 : రెండో టీ20 (తిరువనంతపురం)
డిసెంబర్ 11 : మూడో టీ20 (హైదరాబాద్)
డిసెంబర్ 15 : తొలి వన్డే (చెన్నై)
డిసెంబర్ 18 : రెండో వన్డే (విశాఖ)
డిసెంబర్ 22 : మూడో వన్డే (కటక్)