Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలెన్ డొనాల్డ్, కాథరిన్ కూడా..
లండన్ : టెస్టుల్లో 15921తో అత్యధిక పరుగుల రికార్డు, వన్డేల్లో 18,426 పరుగులతో అగ్రస్థానం, ఓవరాల్‌గా 34, 357 పరుగులతో శిఖర స్థానం. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలతో అసమాన రికార్డు. అంతిమంగా దిగ్గజం పదం సైతం అతడి ఘనతలకు సరిపోలదేమో అనే సంశయం!. అతడే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఆల్‌టైమ్ అత్యుత్తమ క్రికెటర్‌గా పేరొందిన భారత లెజెండరీ క్రికెటర్‌ను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి తీసుకుంది. లండన్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌కు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం అందించింది. ' క్రికెట్ ఉన్నతికి, ప్రాచుర్యానికి ఆటగాళ్లతో కూడిన ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి తీసుకోవటం నాకు గౌరవం. అందులోని అందరూ ఆట అభివృద్దికి, పాపులారిటికి ఎంతో కృషి చేశారు. నా వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన కుటుంబం, కోచ్, మాజీ సహచర ఆటగాళ్లకు, బీసీసీఐ, ఎంసీఏలకు కృతజ్ఞతలు' అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సాధించిన ఆరో భారత క్రికెట్ సచిన్ టెండూల్కర్. 200 వన్డే వికెట్లు, 300 టెస్టు వికెట్లు కూల్చిన తొలి దక్షిణాఫ్రికా సీమర్, తన తరం పేసర్లలో బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన జాబితాలో అగ్రజుడు అలెన్ డొనాల్డ్ సైతం సచిన్‌తో పాటు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ కాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్ సైతం ఈ గౌరవం అందుకుంది.