Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగ్గజంతో ఢలోీ నాగల్ ఓటమి
- ఫెడరర్, సెరెనా, జకో ముందంజ
- యు.ఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
న్యూయార్క్ : 20 గ్రాండ్‌స్లామ్ విజేత, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఒక వైపు. కెరీర్లో ఇంతవరకూ ఓ ఏటీపీ టూర్ సాధించని, తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌కు సిద్ధమైన కుర్రాడు సుమిత్ నాగల్ ఓ వైపు. అభిమాన ఆటగాడితో కెరీర్ అతిపెద్ద మ్యాచ్‌కు బరిలోకి దిగిన సుమిత్ నాగల్ తొలి సెట్లో అబ్బురపరిచాడు. 3-4తో వెనుకంజలో నిలిచిన నాగల్ వరుసగా మూడు గేమ్‌లు గెల్చుకున్నాడు. 6-4తో తొలి సెట్ విజయాన్ని సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. నాగల్ కెరీర్లోనే ఇది అతిపెద్ద సెట్ గెలుపు!. తర్వాతి మూడు సెట్లలో తనదైన జోరు చూపించిన ఫెడరర్ 6-1, 6-2, 6-4తో నాగల్‌పై అలవోక విజయం సాధించాడు. అర్హత రౌండ్లో మూడు విజయాలతో ప్రధాన టోర్నీకి చేరుకున్న నాగల్ యు.ఎస్ ఓపెన్ తొలి రౌండ్ నుంచే నిష్క్రమించాడు. రెండున్నర గంటల తొలి రౌండ్ పోరులో సెట్ విజయంతో నాగల్ సంతృప్తికర ఆటను ప్రదర్శించాడు. డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ 6-4, 6-1, 6-4తో శుభారంభ చేశాడు. స్విస్ ఆటగాడు వావ్రింకా 6-3, 7-6(7-4), 4-6, 6-3తో తొలి రౌండ్ దాటాడు. మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ చేతిలో మరియా షరపోవా చిత్తుగా ఓడింది. 6-1, 6-1తో సెరెనా ఏకపక్ష విజయం సాధించింది. మడిసన్ కీస్ 7-5, 6-0తో, వీనస్ విలియమ్స్ 6-1, 6-0తో తొలి రౌండ్లో సులువుగా గెలుపొందారు.