Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుకు చేరువలో
- ఫైనల్లో ఆండ్రిస్కూతో టైటిల్‌కై ఢీ
న్యూయార్క్: అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి, నల్లుకలువ సెరెనా విలియమ్స్ అరుదైన రికార్డుకు మెట్టు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోటీలో సెరెనా 6-3, 6-1తో 5వ సీడ్ స్విటోలినా(ఉక్రెయిన్)ను వరుససెట్లలో చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది.సెరెనా ధాటికి స్విటోలినా కనీస పోటీ ఇవ్వకుండానే ఓటమిపాలైంది. అద్భుతమైన ఏస్‌లతో చెలరేగిపోయిన సెరెనా ఎక్కడా స్విటోలినాకు అవకాశం ఇవ్వలేదు. దాంతో సెమీస్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. మరో సెమీఫైనల్ పోటీలో కెనడా నయా సంచలనం ఆండ్రిస్కూ 7-6(7-3), 7-5తో 13వ సీడ్ బెన్సిక్(ఇంగ్లండ్)ను చిత్తుచేసింది. తొలిసెట్ టైబ్రేక్ వరకూ కొనసాగడంతో ఆ గేమ్‌ను 7-3 పాయింట్లతో ఆండ్రిస్కూ గెల్చుకుంది. ఇక రెండోసెట్‌లోనూ ఇరువురు పోటా పోటీగా ఆడినా ఒక బ్రేక్ పాయింట్ సాయంతో మ్యాచ్‌ను ఆండ్రిస్కూ ముగించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో తొలిసారి ఫైనల్‌కు చేరిన ఆండ్రిస్కూ సీనియర్ క్రీడాకారిణి సెరెనాతో అమీతుమీ తేల్చుకోనుంది.
మార్గరేట్ కోర్ట్‌కు చేరువలో సెరెనా
అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించడానికి మెట్టు దూరంలో నిలిచింది. శుక్రవారం స్విటొలినాపై గెలిచి గ్రాండ్‌స్లామ్‌ల చరిత్ర 347వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకోవడానికి మెట్టు దూరంలో నిలిచింది. ఇప్పటిదాకా 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచి మార్గరేట్ కోర్ట్ అందరికంటే ముందున్నారు. ఆమె 1963-73 దశాబ్ద కాలంలో ఈ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నారు.
అలాగే గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధికంగా యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను సాధించే అవకాశం ఇప్పుడు సెరెనా ముందుంది. ఇప్పటివరకూ ఆరుసార్లు యుఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన సెరెనా మరో టైటిల్ సాధిస్తే అత్యధికంగా యుఎస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర లిఖించనుంది. గ్రాండ్‌స్లామ్ శకం ఆరంభమైన తర్వాత సెరెనా-క్రిస్ ఎవర్ట్లు మాత్రమే ఆరేసిసార్లు ఈ టైటిల్‌ను గెల్చుకున్నారు. ఇప్పుడు ఎవర్ట్‌ను అధిగమించడానికి సెరెనా అడుగు దూరంలో నిలిచింది. చివరిసారిగా సెరెనా 2016లో యుఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరి 3వ సీడ్ కరోలినా ప్లిస్కోవా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. 2017 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది సెరెనాకు అందని ద్రాక్షగానే ఉంది. గత ఏడాది యుఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ జపాన్ క్రీడాకారిణి ఒసాకా చేతిలో ఓడి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. 2014లో చివరిసారి యుఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను గెల్చిన సెరెనా ఇప్పటివరకూ 10సార్లు యుఎస్ ఓపెన్ సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరి ఏడుసార్లు విజేతగా నిలిచింది.
సెరెనా విలియమ్స్ సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు...
ఆస్ట్రేలియన్ ఓపెన్ : 2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017
ఫ్రెంచ్ ఓపెన్ : 2002, 2013, 2016
వింబుల్డన్ : 2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016
యుఎస్ ఓపెన్ : 1999, 2002, 2008, 2012, 2013, 2014.
ఫైనల్‌కు ఇలా...
సెరెనా విలియమ్స్ ఆండ్రిస్కూ
షరపొవా పై 6-1, 6-1 తొలిరౌండ్ వోలీనెట్స్ పై 6-2, 6-4
మెక్నల్లెపై 5-7, 6-3, 6-1 రెండోరౌండ్ ఫ్లిప్కెన్స్పై 6-3, 7-5
ముఛోవాపై 6-3, 6-2 మూడోరౌండ్ వాజ్నియాకీపై 6-4, 6-4
మార్టిక్పై 6-3, 6-4 ప్రి క్వార్టర్స్ టౌన్‌సెండ్‌పై 6-1, 4-6, 6-2
వాంగ్‌పై 6-1, 6-0 క్వార్టర్‌ఫైనల్స్ మెర్టెన్స్: 3-6, 6-2, 6-3
స్విటోలినా: 6-3, 6-1 సెమీఫైనల్స్ బెన్సిక్‌పై 7-6(7-3), 7-5