Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎప్పటికీ దిగ్గజం కాలేడు
న్యూఢిల్లీ : బాల్‌టాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేధం ముగించుకుని పునరాగమనంలో యాషెస్‌లో శతకాల మోత మోగించిన స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ నైపుణ్యంపై ప్రపంచ క్రికెట్ పండితులు ప్రశంసలు జల్లు కురిపిస్తుండగా, ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం స్మిత్‌పై విమర్శల బాణంతో దాడి చేస్తున్నారు. స్మిత్ మోసగాడంటూ స్టీవ్ హార్మిసన్ విమర్శించగా, అతడి మాజీ సహచరుడు మాంటీ పనేసర్ అదే దారిలో నడిచాడు. మోసగాడు స్మిత్ ఎప్పటికీ దిగ్గజం కాలేడని వ్యాఖ్యానించాడు. ' స్మిత్ పునరాగమనంలో గొప్పగా ఆడుతున్నాడు. బ్యాగీ గ్రీన్ క్యాప్‌తో కంగారూ ఆటగాళ్ల సహజశైలిలో చెలరేగుతున్నాడు. అతడి బ్యాటింగ్ బాగుంది. సాకర్ దిగ్గజం డీగీ మారడోనా గురించి, అతడి వివాదస్పద హ్యాండ్ గోల్ గురించి అందరికీ తెలుసు. ఆ గోల్ కారణంగానే మారడోనాను ఎక్కువగా గుర్తుంచుకున్నారు. స్మిత్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. బాల్ టాంపరింగ్ కుట్రలో స్మిత్ పాత్రతో అభిమానులు అతడిని మోసగాడినే చూస్తారు. స్మిత్‌లో విలువైన నైపుణ్యం ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఎన్ని పరుగులు సాధించినా, కొన్నేండ్ల తర్వాత ప్రజలు అతడిని ఎలా చూస్తారో తెలియదు. దిగ్గజాల సరసన స్మిత్ నిలవటం సబబా? నిజంగా స్మిత్ గొప్ప క్రికెటరా? మోసగాడైన ఓ మంచి క్రికెటర్‌గా? చూస్తారా అనేది చూడాలి.