Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంట్రీలో గ్రాండ్ విక్టరీ
బీజింగ్ : ఒలింపిక్ చాంపియన్, మాజీ వరల్డ్ నం.1 కరొలినా మారిన్ (స్పెయిన్) ఘనమైన పునరాగమనం చేసింది. మోకాలి గాయంతో సుదీర్ఘ సీజన్‌కు దూరమైన మారిన్, రీ ఎంట్రీలో ఆశించిన విజయాలు సాధించలేదు. తాజాగా చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ వేటకు బరిలోకి దిగిన కరొలినా మారిన్.. మెరుపు విజయం సాధించింది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నిలుపుకుంది. అగ్రశ్రేణి షట్లర్ తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన తుది సమరంలో కరొలినా మారిన్ 14-21, 21-17, 21-18తో మెరుపు విజయం సాధించింది. ' ఎంతో సంతోషంగా ఉన్నాను, ఈ సమయంలో నా భావాలను వ్యక్తపరచలేను. తైజు తప్పులు చేసే వరకూ ఎదురుచూశాను. సుదీర్ఘ ర్యాలీలు ఆడేందుకు నిశ్చయించుకున్నాను' అని కరొలినా మారిన్ తెలిపింది. చైనా ఓపెన్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పి.వి సింధు నిరాశపరిచిన సంగతి తెలిసిందే.