Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిలాన్ (ఇటలీ) : సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ తొలిసారి ప్రతిష్టాత్మక ఫిఫా పురస్కారం అందుకున్నాడు. 2016లో ఫిఫా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రవేశపెట్టారు. తొలి రెండేండ్లు పోర్చుగల్ హీరో క్రిస్టియానొ రొనాల్డోను ఈ అవార్డు వరించింది. నిరుడు క్రోయేషియాను ఫిఫా ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేర్చిన లూకా మోద్రిచ్ దక్కించుకున్నాడు. బార్సిలోనా తరఫున చాంపియన్స్ లీగ్‌లో 12 గోల్స్న కొట్టిన మెస్సీ.. యుఈఎఫ్ఏ బెస్ట్ ప్లేయర్ అవార్డు విజేత వాన్ డిక్‌ను వెనక్కి నెట్టి అర్జెంటీనాకు 36 గోల్స్‌తో యూరోపియన్ గోల్డెన్ షు గెల్చుకున్న మెస్సీ.. కోపా అమెరికాలో జాతీయ జట్టుకు కాంస్యం అందించాడు. ఈ ఏడాది ఫిఫా బల్లాన్ డీ అవార్డు రేసులో మెస్సీ, వాన్ డిక్ పోటీపడుతున్నారు. ఫిఫా అవార్డు ప్రదాన వేడుకకు క్రిస్టియానొ రొనాల్డో హాజరు కాలేదు.