Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయ్ హజారే టోర్నీ
ఆలూరు (కర్నాటక) : తొలి రెండు మ్యాచులు రద్దైన తర్వాత, సౌరాష్ట్రపై సూపర్ విజయంతో విజయ్ హజారే ట్రోఫీలో ఘనంగా బోణీ కొట్టిన హైదరాబాద్.. తర్వాతి మ్యాచ్‌లోనే డీలా పడింది. ఎలైట్ గ్రూప్-ఏలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 62 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 228 పరుగుల ఛేదనలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. కెప్టెన్ అంబటి రాయుడు (0) డకౌట్‌తో మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ తన్మరు అగర్వాల్ (69) ఒంటరి పోరాటం చేసినా ఫలితం రాలేదు. అక్షత్ రెడ్డి (0), తిలక్ వర్మ (1), సందీప్ (0), హసన్ (6), దేవ్ గౌడ్ (0) సహా రోహిత్ రాయుడు (18), మల్లికార్జున్ (24) నిరాశపరిచారు. 44.4 ఓవర్లలో హైదరాబాద్ 165 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ 50 ఓవర్లలో 227/9 పరుగులు చేసింది.