Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ,హైదరాబాద్ : క్రీడా నేపథ్యం కలిగిన రెండు కుటుంబాలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నాయి. భారత జట్టు మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తనయుడితో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అజహర్ కుమారుడు అసద్‌తో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సానియా మీర్జా ' ఫ్యామిలీ' అని రాసింది. అప్పటికే సోషల్ మీడియాలో అసద్, ఆనం మీర్జా ఫోటోలు ఉన్నాయి. ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని, వివాహ బంధంతో ఒక్కటి కానున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా పెండ్లి వార్తలను సానియా మీర్జా ధృవీకరించారు. ' ఆనం మీర్జా డిసెంబర్లో వివాహ జీవితం ప్రారంభించబోతుంది. ఇటీవలే పారిస్‌లో ఆనం ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకున్నాం. వివాహంపై ఎంతో ఆసక్తిగా ఉన్నాం. ఆనం లవ్లీ బారు అసద్‌తో వివాహం చేసుకోనుంది' అని సానియా మీర్జా తెలిపింది.