Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోసారి బల్లాన్ డీ అవార్డు సొంతం
పారిస్ : అర్జెంటీనా సూపర్‌స్టార్, సాకర్ గ్లోబల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో రికార్డు సాధించాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆరోసారి ప్రతిష్టాత్మక బల్లాన్ డీ పురస్కారం అందుకున్నాడు. క్రిస్టియానో రొనాల్డో, విర్గిల్ వాన్ డిక్, సాడియో మానెలతో పోటీపడిన లియోనల్ మెస్సీ సోమవారం రాత్రి పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆరో బల్లాన్ డీ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2019లో లియోనల్ మెస్సీ సూపర్ ప్రదర్శన చేశాడు. ఫిఫా మెన్స్ అత్యుత్తమ ఆటగాడు అవార్డును తృటిలో చేజార్చుకున్న మెస్సి.. ఈ ఏడాది 54 గోల్స్ కొట్టాడు. 23 గోల్స్‌కు సహాయకారిగా ఉన్నాడు. చాంపియన్స్ లీగ్ టాప్ స్కోరర్‌గా, లా లిగాలో టాప్ స్కోరర్ కమ్ అత్యధిక గోల్స్ సహాయకారిగా ఉన్నాడు. పదేండ్లుగా రొనాల్డో, మెస్సీ నడుమ బల్లాన్ డీ పోరు నడుస్తోంది. తొలిసారి క్రోయేషియా స్టార్ లుకా మోద్రిచ్ 2018లో బల్లాన్ డీ సాధించి.. రొనాల్డో, మెస్సీలను కాదని ముందు నిలిచాడు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌తో లియోనల్ మెస్సీ మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును ఇంటికి తీసుకెళ్లాడు.