Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 వరల్డ్‌కప్ వ్యూహంపై గంగూలీ
కోల్‌కత : టీమ్ ఇండియా మరో ప్రపంచకప్‌కు ప్రిపేర్ అవుతోంది. 2019 వన్డే వరల్డ్‌కప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కోహ్లిసేన అనూహ్యంగా సెమీఫైనల్లో పరాభవం చవిచూసింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా 2020 టీ20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ సన్నద్దతపై తనకు ఉన్న అభిప్రాయాలను త్వరలోనే కెప్టెన్ విరాట్ కోహ్లి, చీఫ్ కోచ్ రవిశాస్త్రితో పంచుకుంటానని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. ' టీ20 క్రికెట్లో మనం ఛేదనలో బాగున్నప్పుడు, అదే లక్ష్యం నిర్దేశించినప్పుడు ఎందుకు బ్యాటింగ్ ప్రదర్శన అదే స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌పై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. విరాట్ కోహ్లి, రవిశాస్త్రిలతో ఆ విషయాలు పంచుకుంటాను. భారత్ ఎక్కువగా టీ20 మ్యాచులు ఆడలేదు, కానీ వరల్డ్‌కప్ సమయానికి భారత్ సర్వసన్నద్ధం అవుతుంది' అని గంగూలీ అన్నాడు. వెండితెరపై షోలే తనకు ఇష్టమైన సినిమా అని.. అమితాబ్ బచ్చన్, గబ్బర్ సింగ్ పాత్రలు తనకు ఎంతో ఇష్టమని ఓ ప్రశ్నకు సమాధానంగా దాదా చెప్పాడు.