Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు టైటిల్‌పై సెరెనా గురి
- మరో గ్రాండ్‌స్లామ్‌పై రోజర్ కన్ను
- నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) : గ్రాండ్‌స్లామ్ వేటకు దిగ్గజాలు అస్త్రాలతో సిద్ధమయ్యారు. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ క్యాలెండర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో ఆరంభం కానుంది. సోమవారం నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన టోర్నీ షురూ కానుంది. ఆరు సార్లు మెల్బోర్న్ విజేత, స్విస్ లెజెండర్ రోజర్ ఫెడరర్ కెరీర్ 21వ గ్రాండ్‌స్లామ్ వేటలో నిలిచాడు. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రెండేండ్లుగా రికార్డు టైటిల్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న సెరెనా విలియమ్స్ నేడు మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో తలపడనున్నది.
తొలి రోజు ఆసక్తికరం! : ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రోజే దిగ్గజాలు బరిలోకి దిగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్స్ వేటగాడు రోజర్ ఫెడరర్ తొలి మ్యాచ్ ఆడనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్లు నొవాక్ జకోవిచ్, నవొమి ఒసాకలు సైతం నేడు తొలి రౌండ్లో రాకెట్ పట్టనున్నారు. వీడ్కోలు టోర్నీ ఆడుతున్న కరొలినా వొజ్నియాకి, మహిళల సింగిల్స్ వరల్డ్ నం. యాష్లె బార్టీ సైతం నేడే తొలి మ్యాచ్ ఆడనున్నారు. స్విస్ దిగ్గజం ఫెడరర్ తొలి రౌండ్లో అమెరికా ఆటగాడు జాన్సన్‌తో తలపడనున్నాడు. జపాన్ స్టార్ కిరు నిషికోరి క్రొయేషియా ఆటగాడితో పోటీపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో నవొమి ఒసాక తొలి మ్యాచ్‌లో బౌజ్కోవాను ఎదుర్కోనుంది. ఎనిమిదో సీడ్ అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్ టైటిల్ వేటను రష్యా అమ్మాయి అనస్తాసియా పొటపోవతో మొదలెట్టనుంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగుతోంది. ఉక్రెయిన్ భాగస్వామి నదియాతో కలిసి బుధవారం చైనా జోడీతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు పొగ మెల్బోర్న్కు తగులుతోంది. ఇప్పటికే అర్హత మ్యాచులకు దట్టమైన పొగ ఆవహించింది. కంగారూ వేసవిలో ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఓవైపు ఉక్కపోత, ఎండ వేడిమి మరోవైపు పొగ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సవాల్ విసురుతున్నాయి. మెల్బోర్న్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుతోంది.