Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదో స్థానానికి పడిపోయిన కోహ్లి
- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్ : పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అపరిమిత పరుగుల వరద పారిస్తున్నాడు యువ బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్. భారత వన్డే, టీ20 జట్టులో బహుముఖ పాత్రలు పోషిస్తూ.. కోహ్లిసేన రాహుల్ ద్రవిడ్‌లా ప్రశంసలు అందుకుంటున్నాడు. కెరీర్ భీకర ఫామ్‌లో కొనసాగుతున్న కెఎల్ రాహుల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నం.2గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో 56 సగటుతో రాహుల్ 224 పరుగులు కొట్టాడు. ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం నిలుపుకున్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రాహుల్ 823 పాయింట్లతో ఉండగా, బాబర్ 879 పాయింట్లతో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 105 పరుగులే చేసిన విరాట్ కోహ్లి ఓ స్థానం పడిపోయాడు. ఇయాన్ మోర్గాన్‌కు 9వ స్థానం వదులుకుని, పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అరోన్ ఫించ్, కొలిన్ మన్రో, గ్లెన్ మాక్స్‌వెల్‌లు టాప్-5లో నిలిచారు. అఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ రెహమాన్‌లు బౌలర్ల జాబితాలో ముందున్నారు. భారత బౌలర్లలో ఎవరూ టాప్-10లో నిలువలేదు. మహ్మద్ నబి వరల్డ్ నం.1 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్‌లు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.