Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కంబాళ క్రీడలో వెలుగులోనికి వచ్చిన శ్రీనివాస గౌడ రికార్డు మూడురోజులు తిరగకముందే బ్రేక్ అయ్యింది. ఇదే క్రీడలో బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే వ్యక్తి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి శ్రీనివాస గౌడ రికార్డును అధిగమించాడు. వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తాడు. దీంతో గతంలో శ్రీనివాస గౌడ నమోదు చేసిన రికార్డును నిషాంత్ శెట్టి బద్దలు కొట్టాడు. కొద్ది రోజుల క్రితం కంబళ పోటీలో శ్రీనివాస గౌడ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో చేరుకున్నాడు. అంటే వేగం పరంగా 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరిగెత్తాడు.