Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అండ్రీ రసెల్‌కు బ్రావో కితాబు
చెన్నై : ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యంత విలువైన ఆటగాడు విండీస్ వీరోచిత విధ్వంసకారుడు అండ్రీ రసెల్. కెరీర్ సూపర్ ఫామ్‌లో ఉన్న రసెల్‌ను సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో గొప్పగా పొగిడాడు. వెస్టిండీస్‌కు ఇప్పుడు క్రిస్ గేల్, బ్రియాన్ లారాలు ఆండ్రీ రసెలే అని ప్రశంసించాడు. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయటంలో రసెల్ ముఖ్య పాత్ర పోషించాడు. తొలి టీ20లో 14 బంతుల్లో 35 పరుగులు, రెండో టీ20లో 14 బంతుల్లో 40 పరుగులు చేసి విండీస్‌కు విజయాన్ని అందించాడు. నిలకడగా సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంలో రసెల్ నిష్ణాతుడు అయిపోయాడు. ' రసెల్ ప్రపంచంలో అత్యుత్తమం. క్రిస్ గేల్ భీకర ఫామ్‌లో ఉన్నప్పుడూ నేను గేల్‌ను ఇలాగే అన్నాను. ఇప్పుడు రసెల్నూ అదే విధంగా పోల్చుతున్నాను. టీ20 క్రికెట్లో రసెల్ మా క్రిస్ గేల్, మా బ్రియాన్ లారా. అతడు వెస్టిండీస్‌కు ఆడుతుండటం మా అదృష్టం, ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో అతడికి బౌలింగ్ చేసే బాధ మాకు లేదు. రసెల్ సూపర్ స్టార్' అని బ్రావో ప్రశంసల జల్లు కురిపించాడు.