Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫార్ములా వన్ షెడ్యూల్ ఇదే!
పారిస్: ఫార్ములా వన్ సీజన్ జులై 5నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఫార్ములా వన్ రేసులకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నిర్వాహకులు మంగళవారం విడదుల చేశారు. కరోనా వైరస్ కారణంగా నిలిచిన ఫార్ములా వన్ ఆస్ట్రియాలో 5, 12న జరిగే రేసులతో ప్రారంభమౌతాయి. హంగేరీలో మూడవ రేస్ జరగనున్నది. రెండు వారాల విరామం తర్వాత బ్రిటన్, స్పెయిన్, బెల్జియం, ఇటలీలో వరుస రేసులు జరగనున్నాయి. వీక్షకులకు అనుమతులు లేకుండానే ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 2, 9న బ్రిటీష్ గ్రాండ్ ప్రి, 16న బార్సిలోనాలో స్పానిష్ గ్రాండ్ ప్రి జరగనున్నాయి. ఆగస్టు 30న బెల్జియం, సెప్టెంబర్ 6న ఇటలీ గ్రాండ్ ప్రి జరగనుంది. డిసెంబర్‌లోగా కనీసం 18 రేసులు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఎఫ్ వన్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా, వియత్నాం, జపాన్, అమెరికా, మెక్సికో, బ్రెజిల్లో జరగాల్సిన రేసులు రద్దయ్యాయి.