Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్
మెల్బోర్న్ : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు. కెరీర్ అత్యుత్తమ దశలో క్రికెట్లోని రికార్డులు అన్నింటిని తన పేరిటి లిఖించుకున్నాడు. ఇప్పుడు భారత క్రికెట్లో అతని వారసులు మాస్టర్ బ్లాస్టర్ రికార్డులను తిరగరాస్తున్నారు. సచిన్ టెండూల్కర్ రికార్డుల్లో వంద శతకాల రికార్డు ప్రత్యేకం. ఈ రికార్డును ఎవరూ అందుకోలేరనే అంచనాలు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు కింగ్కోహ్లి దూకుడుగా దూసుకొస్తున్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 శతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీలు బాదాడు. విరాట్ కోహ్లి ఇప్పుడీ జాబితాలో రెండో స్థానానికి అడుగు దూరంలో నిలిచాడు. వన్డేల్లో 27, టెస్టుల్లో 43 శతకాలు బాదిన విరాట్ కోహ్లి ఖాతాలో ఇప్పుడు 70 శతకాలు ఉన్నాయి. ' విరాట్ కోహ్లి కచ్చితంగా సాధించగలడు. సచిన్ టెండూల్కర్ ఆడిన సమయంలో కంటే ఇప్పుడు ఫిట్నెస్ ప్రమాణాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. నాణ్యమైన ఫిట్నెస్ ట్రైనర్ల సహాయం సైతం అందుతోంది. దీనికి తోడు డాక్టర్లు, ఫిజియోలు ఉండనే ఉన్నారు. ఏదైనా గాయం సంభవించే ప్రమాదం ఉంటే.. ముందుగానే దాని భరతం పడుతున్నారు. దీంతో చాలా తక్కువ మ్యాచులకు మాత్రమే దూరంగా ఉంటున్నారు. ఎక్కువ క్రికెట్ ఆడుతున్నారు. ఫిట్నెస్, టెక్నిస్, దూకుడు కలిగిన విరాట్ కోహ్లి కచ్చితంగా 100 సెంచరీలు కొట్టగలడు' అని బ్రాడ్హాగ్ అన్నాడు.