Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1951లో మళ్లీ మోటార్ సైకిలెక్కి 9 నెలలపాటు అర్జెంటీనా, చిలీ, పెరూ, ఈక్వడార్, కొలంబియా, వెనిజులా, పనామాలతో పాటు అమెరికాలోని మియామీ, ఫ్లోరిడాలను సందర్శించాడు. మూడోసారి సుదీర్ఘ ప్రయాణం 1987లో బొలీవియాలో ముగిసింది. మెక్సికోలో క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రోకు సన్నిహిత మిత్రునిగా, కామ్రేడ్ గా మారాడు. క్యాస్ట్రోతో కలిసి 1858లో క్యూబా చేరాడు. గెరిల్లా యోధునిగా మొక్కవోని సాహనం చూపాడు. క్యూబా విప్లవంలో క్యాస్ట్రో తర్వాత రెండో నేతగా ఎదిగాడు. 1959లో క్యూబా విప్లవ విజయానంతరం చే ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వహించాడు. 1959లో భారత్ పర్యటించినప్పుడు సైతం చే నిజాన్ని నూటిగా చెప్పడానికి వెనుకాడలేదు.
భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి అర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్థాయిగా నిలుస్తారు. నేటి యువత సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా మారి వారి టీ షర్టులపైనో, టోపీలపైనో దర్శనమిస్తున్న చేగువేరా అలాంటి ఆదర్శజీవి. గుండెలపై గువేరాను మోస్తున్న యువతలో ఎక్కువ మంది ఆ విషయాన్ని ఎరగక పోవడం కనీస వ్యవహారిక జ్ఞానాన్ని ఇవ్వలేని నేటి విద్యా విధానపు వైఫల్యానికి కొండంత రుజువు. చే జీవితంలోకి తొంగి చూసిన వారెవరైనా... ఆయనను గుండెలపైనే కాదు, గుండెలలోనూ దాచుకోకుండా ఉండలేరు. జీవితం విలువను ఎరిగినవాడు కాబట్టే చే తన గుండె నెత్తురుతో పీడిత జన విముక్తి బాటలు వేశాడు. తన జీవితాన్నే పోరుగా మలిచి ఉద్యమ వెలుగెయ్యాడు. అలాంటి 'చే' జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అనివార్యత మున్నెన్నటికన్నా నేడు ఎక్కువగా ఉంది. నేటి తరం చేగువేరా జీవితాన్ని, ఆచరణను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియా పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఎర్నెస్ట్లో చే గువేరా ''విప్లవకారుడు మాత్రమే కాదు, చింతనా పరుడు'' కూడా. వైద్య విద్య కోసం 1948లో బ్యూనస్ ఎయిరిస్ విశ్వవిద్యాలయంలో చేరిన చే 'ప్రపంచాన్ని శోధించాలనే ఆకలి'ని భరించలేక వైద్య విద్యను పక్కనబెట్టి, మోటార్ సైకిల్ ఎక్కాడు. 1950లో ఉత్తర అర్జెంటీనాలోని గ్రామసీమలను చుట్టేస్తూ 4,500 కిలోమీటర్లు ప్రయాణించినా ఆ 'ఆకలి' తీరలేదు. 1951లో మళ్లీ మోటార్ సైకిలెక్కి 9 నెలల పాటు అర్జెంటీనా, చిలీ, పెరూ, ఈక్వడార్, కొలంబియా, వెనిజులా, పనామాలతో పాటు అమెరికాలోని మియామీ, ఫ్లోరిడాలను సందర్శించాడు. మూడోసారి సుదీర్ఘ ప్రయాణం 1987లో బొలీవియాలో ముగిసింది. మెక్సికోలో క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రోకు సన్నిహిత మిత్రునిగా, కామ్రేడ్‌గా మారాడు. క్యాస్ట్రోతో కలిసి 1858లో క్యూబా చేరాడు. గెరిల్లా యోధునిగా మొక్కవోని సాహసం చూపాడు. క్యూబా విప్లవంలో క్యాస్ట్రో తర్వాత రెండో నేతగా ఎదిగాడు. 1959లో క్యూబా విప్లవ విజయానంతరం చే ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వహించాడు.
1959లో భారత్ పర్యటించినప్పుడు సైతం చే నిజాన్ని నూటిగా చెప్పడానికి వెనుకాడలేదు. '' 150 ఏళ్ల సామ్రాజ్యవాద పాలనకు తెరపడింది. కానీ భారత్‌లో ఇంకా పేదరికం తాండవమాడుతూనే ఉంది. ఎక్కువ భూమి కొద్దిమంది చేతుల్లో ఉండటమే దీనికి కారణం. సామాజిక న్యాయం సాధించాల్సిన లక్ష్యం ఇంకా మిగిలే ఉంది.'' మనదేశంలో ఇప్పటికీ అదే పరిస్థితే ఉంది. 1985 ఆల్జీరియాలో చివరిసారిగా చే బహిరంగంగా కనిపించాడు. చే తిరిగి క్యూబాకు వెళ్లలేదు. అప్పటికే తన 'వీడ్కోలు లేఖ'ను రాశాడు. ప్రపంచ విప్లవాన్ని విజయవంతం చేయడానికే తన జీవితాన్ని అర్పిస్తున్నానని స్పష్టం చేశాడు. బొలీవియాలో విప్లవకార్యకలాపాలు ప్రారంభించాడు. సీఐఏ సమాచారంతో 1967 అక్టోబర్ 8న బొలివియా సేనలు భారీ ఎత్తున తరలి చే మకాంను చుట్టుముట్టి దాడిచేశాయి. తీవ్రంగా గాయపడ్డ చేగువేరాను బంధించాయి. ఇంటరాగేట్ చేయడానికి వచ్చిన అధికారులపై ఉమ్మి సత్కరించిన ఆయనను అక్టోబర్ 9న కాల్చి చంపేశారు. అక్టోబర్ 18న క్యూబా రాజధాని హవానాలో పది లక్షల మంది క్యూబన్లు 'చే' కు నివాళులర్పించారు. నేటి యువత మత్తులో చిత్తు అవుతూ, లైంగిక దాడులతో ఉన్మాదులుగా మారుతున్నారు. మతోన్మాద పెట్రేగిపోతూ యువత భవితను నాశనం చేస్తున్న నేటితరుణంలో చే మార్గాన్ని స్వీకరించి అసమానతలు లేని భవితను నిర్మించాల్సి ఉంది.