Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వ్యాక్సినేషన్ నిర్వహణలో దుష్ఫ్రభావాలకు లోనై ఇద్దరు యువతులు మృతి చెందారని, ఆ మరణాలకు కేంద్రం బాధ్యత వహించి పరిహారం ఇప్పించాలని వారి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది. అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరణించివారికి తాము బాధ్యత వహించబోమని కేంద్రం మరో అఫిడవిట్‌ను సమర్పించింది. ఎంతటి నిస్సిగ్గు చర్య ఇది.? మరణాలకు తాము బాధ్యత వహించబోమని చెప్పడమంటేనే పాలన నుంచి పరోక్షంగా వైదొలగడమే.
మనిషిని మానసికంగా కృంగదీసింది.. శారీరకంగా నష్టపరచింది.. ఆర్థికంగా కుదేలు చేసింది.. బంధాన్ని కూడా బంధించింది.. ఆ మహమ్మారి కోవిడ్-19. ఈ వైరస్ ధాటికి ప్రపంచం కునారిల్లింది. కోటికిపైగా మరణించి ఉంటారని ప్రాథమిక అంచనా. కరోనా బారినపడివారు, మానసిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్నవారు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు నేటికీ చాలా మందే ఉన్నారు. అయితే కరోనా కట్టడిలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ వెనుకబడిందన్న విమర్శలున్నాయి. సరైన సమయంలో చర్యలు తీసుకోక పోవడం మూలానా మరణాలు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రజల్లో ఓ వైపు నిరాశ, మరోవైపు ఆందోళన, ఇంకోవైపు చావుభయం అన్నీ ఒకేసారి వెంటాడాయి. ఒకానొక దశలో పాలనా యంత్రాంగం చేతులెత్తేసింది. వ్యవస్థ గాడి తప్పుతుండగా ఒక్కసారిగా లాక్డౌన్ విధించింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పిల్లలు చదువులకు దూరమయ్యారు. వైరస్‌ను అరికట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. కరోనా వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రానిది. అయితే తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం?. వ్యాక్సినేషన్ ప్రక్రియలో దుష్ఫ్రభావానికి లోనై మరణించివారికి పరిహారం ఇచ్చేదిలేదని చెప్పడం సహేతుకమేనా?. ఆలోచించాల్సిన అవసరమున్నది.
చైనా ల్యాబ్ నుంచి వైరస్ పుట్టిందని ఒక దుష్ఫ్రచారం. కానీ అది శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఆ పుకారును తొలగించేందుకు ఆ దేశానికి ఎంతోకాలం పట్టలేదు. కొద్ది నెలల్లోనే కరోనాను కట్టడి చేసి ఇతర దేశాలకు సవాల్ విసిరింది. మరి భారత్‌లో కేంద్రం అసమర్థ చర్యలతో ఈ వ్యాధి దాదాపు రెండేండ్ల పాటు తిష్టేసుకుని కూర్చుంది. ఎన్నో కుటుంబాలను కబళించింది. ఎంతోమంది చనిపోయిన తర్వాత గానీ దృష్టి సారించలేదు. ఫార్మసీ రంగం పరిశోధనల ఫలితంగా కరోనాకు టీకాను తయారు చేసింది. ముందు కొవిషీల్డ్, తర్వాత స్పుత్నిక్వికి కేంద్రం ఆమోద ముద్రవేసింది. వైద్య నిపుణులు ఏ మెడిసిన్ కనిపెట్టినా దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. వంద శాతం ఫలితం ఇస్తుందనే నిర్ధారణకు వచ్చిన తర్వాత బయటకు విడుదల చేస్తారు. అయితే కోవిషీల్డ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే టీకాకు అనుమతినిచ్చామని చెప్పిన కేంద్రం దాని దుష్ఫ్రభావాలకు లోనై చనిపోయిన వారి గురించి వెలుగులోకి రానివ్వడం లేదని దీన్నిబట్టే తెలుస్తోంది. అలాంటి మరణాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇటీవల ఓ ఫిటిషన్ దాఖలైంది.
కరోనా వ్యాక్సినేషన్ నిర్వహణలో దుష్ఫ్రభావాలకు లోనై ఇద్దరు యువతులు మృతి చెందారని, ఆ మరణాలకు కేంద్రం బాధ్యత వహించి పరిహారం ఇప్పించాలని వారి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది. అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరణించివారికి తాము బాధ్యత వహించబోమని కేంద్రం మరో అఫిడవిట్‌ను సమర్పించింది. ఎంతటి నిస్సిగ్గు చర్య ఇది.? మరణాలకు తాము బాధ్యత వహించబోమని చెప్పడమంటేనే పాలన నుంచి పరోక్షంగా వైదొలగడమే. టీకాల వాడకం నుంచి ఇమ్యూనైజేషన్ తర్వాత ప్రతికూల ప్రభావాల కారణంగా అత్యంత అరుదుగా మరణించే వారికి పరిహారం అందించడానికి ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయడం చట్టపరంగా నిలవదని పేర్కొంది. ఇది బాధ్యతారాహిత్యమని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?. కరోనా వల్ల తమ ఆప్తులను, ఆస్తులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాల్సిన కేంద్రం తమకు అపకీర్తి రాకూడదనే మరణాలను దాస్తున్నట్టు స్పష్టమవుతోంది.
లాక్‌డౌన్‌తో ప్రజా జీవనం స్తంభించిన విషయం తెలిసిందే. ఆహారం దొరక్క ఎంతోమంది ఆకలితో అలమటించి చనిపోయారు. గుట్టలు గుట్టలుగా శవాలు గంగానదిలో ప్రత్యక్షమయ్యాయి. వలస కూలీలైతే వారి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరి మధ్యలోనే చాలామంది మరణించారు. దీనికి బాధ్యత ఎవరిది?. ఔషధాలకు దుష్ఫ్రబావాలు ఉన్నట్టు, టీకాకు ఉంటాయని కోర్టుకు చెప్పడమంటే కోవిడ్ మరణాలను కూడా సహజంగానే చూస్తున్నట్టే కదా. అయితే ప్రజలు వ్యాధుల బారినపడి చనిపోతుంటే ప్రజలు లేని పాలన ఎవరి కోసం?. కరోనా మృతుల సమాధుల లెక్కల్లో కూడా తక్కువ చూపే పరిస్థితులు రావడం బాధాకరం. ప్రజా సంక్షేమం మరిచి ఇలాంటి వైఖరి అవలంభించడం వల్లే కోవిడ్ మానని గాయంగా ఉంటోంది.